Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: చ‌ర‌ణ్‌-ఉపాస‌న జంట‌పై శుభ‌వార్త చెప్పిన చిరు

By:  Tupaki Desk   |   12 Dec 2022 9:46 AM GMT
బ్రేకింగ్: చ‌ర‌ణ్‌-ఉపాస‌న జంట‌పై శుభ‌వార్త చెప్పిన చిరు
X
చ‌ర‌ణ్ అభిమానుల‌కు ఇది చాలా కాలంగా వినాల‌నుకుంటున్న మెగా శుభ‌వార్త‌. మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఈ శుభ‌వార్తను చెప్పారు. 'చిరుత‌'న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తండ్రి కాబోతున్నారు. చరణ్- ఉపాసన తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఆ మేర‌కు మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఒక ట్వీట్ లో శుభ‌వార్త‌ను అందించారు.

మెగా ఇంట ఇప్పుడు సంబ‌రాలు మిన్నంటాయి. చిరంజీవి- సురేఖ ఆనందడోలిక‌ల్లో మునిగితేలుతున్నారు. ఇప్ప‌టికే ఇత‌ర‌ కుటుంబ స‌భ్యుల నుంచి దీనిపై ధృవీక‌ర‌ణ వ‌చ్చింది. త్వ‌ర‌లో మ‌మ్మీ డాడీ కాబోతున్న ఉపాస‌న‌- చ‌ర‌ణ్ ల‌కు అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ మెగాభిమానులు సామాజిక మాధ్యమాల్లో త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ - ఉపాసన కామినేని 14 జూన్ 2012 న హైదరాబాద్ లో ఘ‌న‌మైన వివాహ‌ వేడుకలో ఒక‌ట‌య్యారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు. మెగా న‌ట‌వార‌సుడిగా రామ్ చరణ్ స్టార్ డ‌మ్ ని అందుకునేందుకు కెరీర్ ఆరంభం ఎంతో శ్ర‌మించారు.

ఓవైపు కెరీర్ కోసం మెగాస్టార్ లెగ‌సీని ముందుకు న‌డిపించ‌డం కోసం చ‌ర‌ణ్ అహోరాత్రులు శ్ర‌మిస్తుండ‌గానే త‌న స్నేహితురాలితో ప్రేమ‌వివాహం జ‌రిగింది. అయితే త‌మ తొలి సంతానం గురించి వెల్ల‌డించేందుకు కొంత స‌మయం ప‌ట్టింది.

ఎట్ట‌కేల‌కు త‌మ ఇంటికి కొత్త వెలుగులు రాబోతున్నాయ‌ని మెగాస్టార్ ప్ర‌క‌టించ‌గానే అభిమానుల్లో సంబ‌రాలు మిన్నంటాయి. దశాబ్దం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆనందం వెల్లివిరియబోతోందని రామ్ చరణ్- ఉపాస‌న జంట ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నార‌ని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.