Begin typing your search above and press return to search.
ఆ విషయంలో చిరంజీవే తరవాతే
By: Tupaki Desk | 18 Dec 2017 4:29 AM GMTనటనపై అభిమానంతో ఇండస్ట్రీలోకి వచ్చి గుర్తింపు వచ్చినా కాలం కలిసిరాక పైస్థాయికి ఎదగకుండా ఉండిపోయేవారెందరో. కాలగమనంలో అరోగ్యం సహరించక ఆసుపత్రి పాలయితే డబ్బు ఖర్చులకు సాయం అందక ఇబ్బంది పడుతున్న వారున్నారు. ఇలాంటి వాళ్లకోసం నటుడు కాదంబరి కిరణ్ కుమార్ మనం సైతం అనే ఛారిటీ ఫండ్ ఏర్పాటు చేశాడు. పేదరికంలో ఉన్న నటులను గుర్తించి వారి దీనగాథలను పదుగురికి పరిచయం చేస్తూ వారికి వీలైనంత సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఆనాటి కమెడియన్ పొట్టి వీరయ్య ప్రస్తుతం ముసలివాడై పోయి ఆర్థికంగా కష్టాలు పడుతున్నాడని మనం సైతం ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి అతడి వైద్య సహాయం కోసం వ్యక్తిగతంగా రూ. 2 లక్షలు పంపించారు. అంతకుముందు కమెడియన్ గుండు హనుమంతరావు ఈ మధ్య ఆరోగ్యం దెబ్బతిని ఫైనాన్షియల్ ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో పడిందీ ఓ టీవీ షోలో ఆలీ ఎదుట బయట పెట్టాడు . అతడికి కూడా చిరంజీవి వ్యక్తిగతంగా సహాయం అందేలా ఏర్పాటు చేశాడట. కింది స్థాయిలో ఉన్న నటులకు సహాయం చేసే అలవాటు ఇండస్ట్రీలో చాలా తక్కువమందికే ఉంటుంది. కానీ మెగా స్టార్ ఈ విషయంలో తిరుగులేని స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
ఇలాంటి సహాయ గుణం ఉండబట్టే దాసరి తరవాత ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండే స్థానాన్ని చిరంజీవి తీసుకోవాలనే మాట ప్రస్తుతం వినిపిస్తోంది. ‘‘దాసరిలా చొరవ తీసుకుని, అందరినీ కలుపుకుపోయే గుణం ఒక్క చిరంజీవిలోనే ఉన్నాయి. పైగా ఇండస్ట్రీతో సుదీర్ఘ అనుభవం ఉంది. దాసరి పెద్దరికానికి సరైన వారసుడు చిరంజేవి’’ అని సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. దాసరిపై సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన ‘తెర వెనుక దాసరి’ పుస్తకంను స్వయంగా చిరు విడుదల చేయడమే కాకుండా, ఆ ఫంక్షన్ కి అయిన ఖర్చంతా ఆయనే పెట్టుకున్నారు. ఇటువంటి గుణం ఒక్క దాసరిగారిలోనే ఉంది. మళ్లీ చిరంజీవిలోనే చూస్తున్నామని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. తాజాగా పేద నటులకు అందించిన వితరణ చిరంజీవి పెద్దరికానికి మరింత శోభనిచ్చేదే.