Begin typing your search above and press return to search.

జూనియర్ చెర్రీపై చిరు డైలాగ్స్

By:  Tupaki Desk   |   21 May 2017 9:22 AM GMT
జూనియర్ చెర్రీపై చిరు డైలాగ్స్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కామినేని వారింటి అమ్మాయి ఉపాసనలకు పెళ్లయి దాదాపు 5 ఏళ్లు కావస్తోంది. 2012 జూన్ 14న చరణ్- ఉపాసనల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికీ ఒకరినొకు సోషల్ మీడియాలో పొగుడుకోవడం.. తమ ఆప్యాయతను.. క్రమశిక్షణను తెలియచేయడం తప్ప అసలు సంగతిని మాత్రం ఇప్పటివరకూ చెప్పలేదు ఈ జంట.

మెగాస్టార్ చిరంజీవికి తనయుడుగా రామ్ చరణ్ మీద మెగా ఫ్యాన్స్ కు ఎంతటి ప్రేమ ఉందో.. రామ్ చరణ్ కు పుట్టబోయే సంతానంపై కూడా అంతే ఉత్సాహం ఉంది. అయితే.. చెర్రీ మాత్రం ఆ సంగతి చెప్పడం లేదు. రీసెంట్ గా చిరంజీవికి ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. తాత అని ఎప్పుడు పిలిపించుకుంటున్నారు అంటూ 61 సంవత్సరాల చిరంజీవిని అడిగితే.. ఆయన సింపుల్ గా 'ఇప్పటికే ముగ్గురితో పిలిపించుకుంటున్నాగా' అంటూ నవ్వుతూ సమాధానం దాటేసేందుకు ప్రయత్నించారు. అంటే తన కూతుళ్ల పిల్లలతో తాతా అని పిలిపించుకుంటున్నారు కదా.. ఆ విషయాన్నే ఇలా చెప్పారన్న మాట.

దీంతో రామ్ చరణ్ వారసుడి సంగతేంటి అంటూ నేరుగానే ప్రశ్నించాల్సి వచ్చింది. 'అది రామ్ చరణ్ ప్లాన్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలి. అయినా త్వరలోనే ఆ ముచ్చటా తీరిపోతుందిలే' అంటూ ఓ చిన్న హింట్ ఇచ్చి ఊరించారు చిరంజీవి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/