Begin typing your search above and press return to search.
మెగాస్టార్ సీరియస్ లీ హర్ట్!
By: Tupaki Desk | 5 Sep 2018 4:13 AM GMTగత కొంతకాలంగా మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) రచ్చ గురించి తెలిసిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అసోసియేషన్ లుకలుకలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం కమిటీ సభ్యులే రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం - మీడియాకెక్కడంతో అసలు గుట్టు అంతా బయటికొచ్చింది. 5.50 కోట్ల నిధి చుట్టూ ఎవరికి వారు రాజకీయాలు చేస్తూ ఆరోపణలు - ప్రత్యారోపణలతో హోరెత్తించేస్తున్నారు. అమెరికా సిల్వర్ జూబ్లీ ఈవెంట్ పేరుతో మా అధ్యక్షుడు శివాజీరాజా నిధిని దుర్వినియోగం చేశాడని ప్రధాన కార్యదర్శి హోదాలో నరేష్ ఆరోపించారు. నిరూపిస్తే గుండు గీయించుకుంటానని - ఆస్తి రాసిస్తానని శివాజీ రాజా మీడియాకెక్కారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేస్తూ మీడియాకెక్కడం చర్చకొచ్చింది. ఈ ఇష్యూని మెగాస్టార్ చిరంజీవి సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని భావించినా - గొడవలతో ఈసీ సభ్యులంతా మీడియాకెక్కడంతో పెద్ద రచ్చయ్యింది. అంతేకాదు ఈ వివాదంలోకి మెగాస్టార్ పేరుని లాగారు. ఆయనకు ఏ సంబంధం లేని గొడవలోకి లాగడంతో హర్టయ్యారని తెలుస్తోంది.
ఈ వివాదంలో నిధుల గోల్ మాల్ నిజానిజాలేంటో ఇంకా తేలలేదు. దీనిపై ఉన్నతాధికారుల కమీషన్ వేయాలని సీనియర్ నరేష్ డిమాండ్ చేశారు. ఇందులో శివాజీరాజా - శ్రీకాంత్ - పరుచూరి వెంకటేశ్వరరావు బృందం తప్పెంత? నరేష్ బృందం తప్పెంత? అన్నది తేలాల్సి ఉందింకా. అయితే తాజా పరిణామంతో తలెత్తిన తలనొప్పులతో మెగాస్టార్ హర్టయ్యారని చెప్పుకుంటున్నారంతా. మా అసోసియేషన్ ఫౌండర్ ఛైర్మన్ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికి 700పైగా సభ్యులు ఉన్న అతిపెద్ద అసోసియేషన్ ఇది. ఏదైనా సంఘంలో సమస్య వస్తే దానిని మాట్లాడుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఒకే కుటుంబంలో గొడవగా దీనిని పరిగణించాలి. అంతేకానీ ఇలా మీడియాకెక్కి రచ్చ చేస్తే ఇంటి పెద్దకే బ్యాడ్ నేమ్ వస్తుందనడంలో సందేహం లేదు. చిరు ప్రస్తుతం ఈ సమస్యను ఆ కోణంలోనే చూస్తున్నారట. సమస్య పెద్ద స్థాయికి చేరడంతో తలనొప్పులు వచ్చాయన్నది జనం చెబుతున్న మాట.
ఇకపోతే ఇటీవల పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ చానెళ్లు నిజానిజాలేంటో గ్రహించకుండా ఈ విషయంపైనా, మెగాస్టార్ పైనా ఇష్టానుసారం కథనాలు వండి వార్చడం చర్చకొచ్చింది. ఈ వివాదంలోకి చిరు పేరును లాగడం మరీ దారుణం అన్న విమర్శలు వినవస్తున్నాయి. చిరు స్వయంగా ఇరువర్గాల్ని పిలిచి సామరస్యంగా పరిష్కరించాలనుకుంటే తన పేరును ఇందులోకి లాగడం ఎంతవరకూ సబబు? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.