Begin typing your search above and press return to search.
మెగా ఫ్యాన్స్ ను మెప్పించే యత్నమా?
By: Tupaki Desk | 1 Nov 2017 4:40 AM GMTసీనియర్ హీరో రాజశేఖర్ ఈమధ్య అస్సలు ఫాంలో లేడు. ఎవడైతే నాకేంటి తరవాత కమర్షియల్ హిట్ అన్నది అందకుండా పోయింది. తన సాటి హీరోల స్టయిల్ లో విలన్ గా టర్న్ తీసుకోవడానికి ఆలోచిస్తున్న తరుణంలో భారీ యాక్షన్ చిత్రం చేసే అవకాశమొచ్చిందే. అదే గుంటూరు టాకీస్ ఫేం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన పి.ఎస్.వి. గరుడవేగ 126.18ఎం. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
తన కెరీర్ కు కమర్షియల్ హిట్ అత్యంత అవసరమైన ఈ తరుణంలో వస్తున్న గరుడవేగ సినిమాను రాజశేఖర్ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమా సన్నీలియోన్ తో ఐటం సాంగ్ పెట్టడంతో పాటు రిలీజ్ ఈవెంట్ కు ఆమెను పిలిపించి స్టెప్పులు వేయించారు. ఇప్పుడేమో రాజశేఖర్ తన మాటలతో మెగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గరుడవేగ సినిమా చూడాలంటూ చిరంజీవిని స్వయంగా కోరానని చెప్పుకొచ్చాడు. దాంతో చిరు సినిమా ట్రైలర్ చూసి బాగుందనడమే కాదు.. తన ఆఫీసులో కూడా ఈ సినిమా గురించే డిస్కస్ చేస్తున్నారని చెబుతూ గరుడవేగ ట్రైలర్ బాగుందని కితాబు ఇచ్చారని అంటున్నాడు.
ఒకానొక దశలో విలన్ గా చేయడానికి రెడీ అయ్యారనే విషయం మీడియా గుర్తు చేస్తే తనకు వచ్చిన ఆఫర్లన్నీ హీరో చేతిలో తన్నులు తినడానికే పుట్టాడన్నట్లుగా డిజైన్ చేశారని రాజశేఖర్ చెప్పాడు. అలాంటి పాత్రలు చేయడం ఎందుకని అనిపించి అవేవీ ఒప్పుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. ధృవ సినిమాలో అరవింద్ స్వామిలాంటి పాత్రం అయితే చేస్తానంటున్నాడు. అయినా విలన్ అన్నాక హీరో చేతిలో తినకుండా ఎలా ఉంటాడు? హీరోతో ఫైట్ కు దిగనప్పుడు విలన్ ఎలా అవుతాడు.. మరీ ఇన్ని లెక్కలేసుకుంటే విలన్ పాత్రలు దొరకడం చాలా కష్టమేమో రాజశేఖర్ ..