Begin typing your search above and press return to search.
సంపూ టీజర్ చూసి ‘చిరు’నవ్వు
By: Tupaki Desk | 29 May 2016 4:17 AM GMTబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆనందానికి అవధుల్లేవిప్పుడు. బాబు కొత్త సినిమా ‘కొబ్బరిమట్ట’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేసింది సోషల్ మీడియాలో. బర్నింగ్ స్టార్ పలికిన సుదీర్ఘమైన డైలాగ్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ.. మొత్తానికి అది చర్చనీయాంశం అయితే అయ్యింది. టీజర్ సెన్సేషనల్ హిట్టయిపోయింది. 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్స్ లో దీనికి చోటు దక్కింది. ట్విట్టర్లో సైతం ‘కొబ్బరి మట్ట’ ట్యాగ్ హైదరాబాద్ స్థాయిలో టాప్ లో ట్రెండ్ అయింది. సెలబ్రెటీలు చాలామంది ఈ టీజర్ గురించి పాజిటివ్ గా స్పందించారు.
ఇప్పుడిక సంపూ ఆనందాన్ని రెట్టింపు చేసే పరిణామం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ టీజర్ చూశారు. నిన్న సినీ కార్మికులకు సంబంధించి జరిగిన సన్మాన వేడుకకు చిరంజీవి అతిథిగా రాగా.. అక్కడే మాటు వేసిన సంపూర్ణేష్ బాబు చిరును కలిసి తన టీజర్ చూపించాడు. తన మేనల్లుడు సాయిధరమ్ రిలీజ్ చేసిన ఈ టీజర్ ను చిరంజీవి ఆసక్తిగా తిలకించాడు. సంపూ పలికిన సుదీర్ఘమైన డైలాగ్ చూస్తూ సరదాగా నవ్వుకున్నాడు మెగాస్టార్. టీజర్ బాగుందంటూ సంపూను అభినందించాడు కూడా. ఇక బర్నింగ్ స్టార్ ఆనందానికి అవధులేముంటాయి చెప్పండి. కేవలం సోషల్ మీడియాను నమ్ముకుని ఎదిగిన సంపూ.. ఇలా తన సినిమా టీజర్ ను మెగాస్టార్ కు చూపించి ప్రశంసలు అందుకోవడం చిన్న విషయం కాదు కదా.