Begin typing your search above and press return to search.
చిరు-రవితేజ మధ్య ఇలాంటి పరాచకాలు ఇంకెన్నో!
By: Tupaki Desk | 8 Jan 2023 1:30 PM GMT`వాల్తేరు వీరయ్య` ట్రైలర్ తో ప్రేక్షకులు సహా అభిమానులంతా ఓ అంచనాకి వచ్చేస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ అని తేలిపోయింది. దీని మీద ఇక్చ చర్చలు..రాద్దాంతాలు అనవసరమని క్లారిటీ వచ్చేసింది. అన్ని రకాలుగా మాస్ మసాలా ఎంటర్ టైనింగ్ అంశాలలో ముడిపడిన స్టోరీ. థియేటర్కి వెళ్లే ముందు మైండ్ ని ఫిక్స్ చేసుకుని వెళ్తే కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ దొరికేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ విషయంలో దర్శకుడు బాబి ముందు నుంచి ఏ విషయం అయితే గట్టిగా చెబుతున్నాడో? అదే చేసాడని తేలిపోయింది. ఓసారి ట్రైలర్ లోని కొన్ని ఫన్నీమూవ్ మెంట్స్ చూస్తే...ఓ సెక్షన్ ఆడియన్స్ కి వీరయ్య కనెక్ట్ అవ్వడంలో పీక్స్ కి తీసుకెళ్తుందని చెప్పొచ్చు.
ట్రైలర్ ఊహించినట్లే అభిమానుల్లో `మాస్ పూనకాలు` సృష్టించింది. చిరంజీవి మాస్ లుక్.. స్టైలిష్ యాక్టింగ్.. మాస్ డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ లో సైతం నవ్వులు తెప్పిస్తున్నాయి. చిర-రవితేజ పాత్రల మధ్య ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు మరింత హైలైట్ అవుతున్నాయి. ట్రైలర్‌లోని అత్యంత ఆకర్షణీయమైన అంశాలు గా వీటిని చెప్పొచ్చు.
ఇద్దరి మధ్య పోలీస్ స్టేషన్‌లో వాడివేడిగా సాగే చర్చ. ఈ సన్నివేశంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? వారు తమ స్వంత ఐకానిక్ డైలాగ్‌లను రివర్స్ చేయడం. `ఘరానా మొగుడు`.. `రౌడీ అల్లుడు` సినిమాల్లోని చిరు సూపర్‌హిట్ డైలాగ్ లు 'ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా.. బాక్స్ బద్దలు అయిపోద్ది వంటి డైలాగులు మాస్‌రాజా పలుకడం.. చిరు పలికిన `ఇడియట్` సినిమా డైలాగ్.. `సిటీకి ఎంత మంది కమీషనర్లు వస్తున్నారు పోతుంటారు` వంటి పంచ్ డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి.
సినిమా లో చిరు -రవితేజల మధ్య ఇలాంటి సరదా సన్నివేశాలతో కూడిన వివాదాలు చాలానే ఉంటాయని గెస్ చేయోచ్చు. ఇద్దరి మధ్య క్లాష్ సన్నివేశాలు కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ గొడవ సినిమాకి సీరియస్ నెస్‌ని తెస్తుంది. అవి ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన `వాల్తేరు వీరయ్య` జనవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.