Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోలను తక్కువ అంచనా వేయొద్దు బాసూ

By:  Tupaki Desk   |   23 Jan 2023 2:30 AM GMT
సీనియర్ హీరోలను తక్కువ అంచనా వేయొద్దు బాసూ
X
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు కొత్త కథల చుట్టూ తిరుగుతోంది. కొత్తదనాన్ని ప్రేక్షకులు కోరుకుంటున్నారనే ఉద్దేశంతో తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు ఎక్కువగా కొత్త కథలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మన సీనియర్ హీరోల పని అయిపోయింది. వీళ్లు కొత్త సినిమాల్లో ఎలాగో నటించలేరు. కాబట్టి వీరు ఇళ్ళకే పరిమితం కావాలని కొందరు అనుకున్నారు. కానీ వారందరూ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇప్పుడు సీనియర్ హీరోలు వరుస హిట్లు కొడుతున్న విషయం హాట్ టాపిక్గా మారుతుంది.

ఆచార్య లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడానికి కేవలం ఎనిమిదే నెలలు పట్టింది. అది కూడా ఒక రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ సినిమాతో. అలాగే అనేక దారుణమైన డిజాస్టర్లు తర్వాత నందమూరి బాలకృష్ణ అఖండ అనే సినిమాతో హిట్టు అందుకోవడమే కాదు... వీర సింహారెడ్డి సినిమాతో కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు రాబట్టి సత్తా చాటుకున్నాడు. ఇక మాస్ మహారాజా రవితేజ అయితే కేవలం 21 రోజుల వ్యవధిలో విడుదలైన రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.

తెలుగు సినిమా ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ కావాలని అనుకుంటున్నారో... అలాంటి కంటెంట్ ఇచ్చేసి ఈ ముగ్గురు సీనియర్లు హీరోలు హిట్లు కొట్టారని చెప్పొచ్చు. ఒకరకంగా చూసుకుంటే ఇక తెలుగు సినిమా కొత్తదనం వైపు అడుగులు వేస్తోంది. సీనియర్ హీరోలకు అవకాశాలే రావు అనుకుంటున్న తరుణంలో 100 కోట్ల సినిమాలు అందుకోవడమే కాదు మా సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.

అందుకే ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా రొటీన్ గానే ఉన్నా ప్రేక్షకులు ఇంకా బ్రహ్మరథం పడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. సినిమాలో ఇద్దరు హీరోలు ఉండడంతో పాటు కామెడీ ఎమోషన్స్ డాన్స్ యాక్షన్ గా అన్ని యాంగిల్స్ వర్క్ అవుట్ కావడంతో ఈరోజుకి సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు వెళుతుంది.