Begin typing your search above and press return to search.
చిరంజీవికి రోల్ మోడల్ ఈయన
By: Tupaki Desk | 25 Feb 2016 9:50 AM GMTబాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హాపై పుస్తకం రాశారు రచయిత్రి భారతీ ప్రధాన్. ఏడేళ్లకు పైగా కష్టపడి ఈ బుక్ రాసిన ఆమె.. రీసెంట్ గా బుక్ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు సినీ ఇండస్ట్రీల నుంచి దిగ్గజాలు హాజరయ్యారు. చిరంజీవి, మోహన్ బాబులతోపాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఖామోష్ బుక్ లాంఛింగ్ ఈవెంట్ లో సందడి చేశారు.
'నేను సినిమాల్లోకి రావడానికి ఇన్ స్పిరేషన్ శతృఘ్న సిన్హా. ఆయన నటించిన ప్రతీ సినిమానీ వదిలిపెట్టకుండా చూసేసేవాడిని, ఫ్లాప్ సినిమాలను కూడా వదిలిపెట్టలేదు. శతృఘ్నసిన్హాకు సరిపోయేలా ఒక యాక్టర్ అయినా కనిపిస్తే.. నేను గర్వంగా ఫీలవుతా' అంటూ ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు చిరంజీవి. నిజానికి శతృఘ్న సిన్హాకు.. మోహన్ బాబుకు మంచి దోస్తానా ఉంది.
తమ అనుబంధాన్ని పంచుకుంటూ 'ఒక విలన్ - హీరో - రాజకీయ నాయకుడిగా రాణించడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ దాన్ని సుసాధ్యం చేసి చూపించిన వ్యక్తి శతృఘ్న్ - బాలీవుడ్ లో ఎవరైనా - ఎవరికైనా - ఏ సాయం కావాలన్నా నిర్భయంగా అడగగలరు. వాటన్నిటినీ తీర్చే సద్గుణం కూడా ఉంది. అన్నిటి కంటే ముఖ్యంగా... చివరి ప్రాణం పోయేవరకూ బీజేపీలో ఉంటా' అన్న కమిట్ మెంట్ తనకు చాలా ఇష్టం అంటూ చెప్పారు మోహన్ బాబు.