Begin typing your search above and press return to search.

'కత్తి' మీద కన్నేసిన మెగాస్టార్‌ చిరు?

By:  Tupaki Desk   |   19 Sept 2015 12:22 PM IST
కత్తి మీద కన్నేసిన మెగాస్టార్‌ చిరు?
X
మెగాస్టార్ రీ ఎంట్రీకి అన్నీ రెడీ అయిపోయాయి ఒకటి తప్ప. అదే స్టోరీ. పూరి జగన్నాధ్ - వీవీ వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ల నుంచి చాలా కథలు విన్నా వేటికీ సంతృప్తి చెందని చిరు.. చివరకు ఓ కథ దగ్గర తన సెర్చింగ్ ఆపేశారట. అదే తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన కత్తి. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. తమిళ్ లో ఎన్నో రికార్డులు సాధించింది.

కాన్సెప్ట్ పరంగా కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన రీమేక్ చేయాలని అనుకున్నారట చిరంజీవి. ఇప్పటికే తన సన్నిహిత వర్గాలతో దీనిపై డిస్కషన్స్ కూడా పూర్తి చేశారని టాక్. అంతే కాదు.. టాలీవుడ్ ప్రేక్షకులకు వీలుగా... మార్పులు చేయాలని పరుచూరి బ్రదర్స్ కి ఆర్డర్స్ పాస్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లు పని మొదలుపెట్టేశారు కూడా. ఇన్నేళ్లకు చిరుకు నచ్చే స్టోరీ ఒకటి నచ్చినా.. అది రీమేక్ కావడం కాస్త ఆలోచించాల్సిన విషయం. ఈ మూవీ డైరెక్టర్ కి చిరుకు బాగానే అనుబంధం ఉంది. చిరు కెరీర్ లో పెద్ద హిట్ అయిన ఠాగూర్ కి ఒరిజినల్ ఈయనదే. అంతే కాదు.. స్టాలిన్ చిత్రాన్ని కూడా చిరుతో చేశాడు మురుగదాస్. ఇప్పుడు కత్తిలాంటి సెన్సేషనల్ స్టోరీ కూడా ఆయనదే. ఒకవేల ఈ కాన్సెప్ట్ ఫైనలైజ్ అయితే మాత్రం.. డైరెక్ట్ చేసే అవకాశం కూడా మురుగదాస్ కే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.

ఇకపోతే గతంలో ఇదే కత్తిని పవన్‌ కళ్యాన్‌ - ఎన్టీఆర్‌ తదితర హీరోలు రీమేక్‌ చేయడానికి సంకోచించిన విషయం కూడా తెలిసిందే.