Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ విష‌యంలో చిరు చాలా క్యాలిక్యులేటెడ్ గా వున్నారే?

By:  Tupaki Desk   |   11 Jan 2023 2:30 PM GMT
జ‌గ‌న్ విష‌యంలో చిరు చాలా క్యాలిక్యులేటెడ్ గా వున్నారే?
X
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఓ అజాత శ‌త్రువు. త‌న‌పై ఎంత మంది ఎన్ని రకాలుగా విమ‌ర్శ‌లు చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకోర‌న్న‌ది తెలిసిందే. త‌నపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ని చిరు త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్ ఇస్తూ లైట్ తీసుకోవ‌డం గ‌త కొంత కాలంగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ప్రేక్ష‌కులు చూస్తున్న‌దే. త‌న‌ని ఎంత‌గా ఇబ్బంది పెట్టాల‌ని చూసినా చిరు చిరు న‌వ్వుతో స‌మాధానం చెప్ప‌డం ఆయ‌న స్టైల్‌. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లేటెస్ట్ మూవీ `వాల్తేరు వీర‌య్య‌`. బాబి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జ‌న‌వ‌రి 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

టీజ‌ర్ ట్రైలర్‌ల‌తో ప్రేక్ష‌కుల్లో ఈ మూవీపై అంచ‌నాలు పెరిగిపోయాయి. గ‌తంతో పోలిస్తే చిరు వింటేజ్ లుక్ లో ఊర మాసీవ్ పాత్ర‌లో న‌టించిన సినిమా కావ‌డం, మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌డం..శృతిహాస‌న్ హీరోయిన్ గా చిరుతో క‌లిసి తొలి సారి న‌టించ‌డంతో అభిమానులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి కొన్ని గంట‌ల్లో యుఎస్ లో ప్రీమియ‌ర్స్ స్టార్ట్ కానున్నాయి.

ఈ నేప‌థ్యంలో సినిమా ఫైన‌ల్ ప్ర‌మోష‌న్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. బుధ‌వారం మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పిన చిరు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విష‌యంలో మాత్రం చాలా బ్యాలెన్డ్స్ గా ఎక్క‌డా తొర‌క్కుండా మాట్లాడిన తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. గ‌త కొంత కాలంగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న టికెటింగ్ విధానం కార‌ణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.

ఈ విధానం వ‌ల్ల భారీ సినిమాలు కోట్ల‌ల్లొ న‌ష్టాల‌ని చ‌వి చూడాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా పండ‌గ వేళ రిలీజ్ అవుతున్న సినిమాల టికెట్ ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం స్పందించ‌డం బాల‌య్య సినిమాకు టికెట్ కు 20, చిరు సినిమాకు 25 పెంచుకునే వెలుసుబాటుని క‌ల్పించ‌డం తెలిసిందే. సినీ ఇండ‌స్ట్రీపై ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై చిరుని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నిస్తే.. చిరు చాలా డిప్ల‌మాటిక్ గా స్పందించ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌ట‌మే మేం చేయ‌గ‌లం. దానిని గౌర‌వించ‌డం త‌ప్ప మ‌న‌కు వేరే మార్గం లేద‌న్నారు. అంతే కాకుండా వారి ఆదేశాలు విధించ‌యే స‌మ‌యంలో వారు తీసుకున్న ప‌రిమితుల‌ను మ‌నం గౌర‌వించాలని, వాటి వ‌ల్ల కోట్ల‌ల్లో న‌ష్టం వాటిల్లినా దాన్ని పూడ్చుకోవ‌డం కోసం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ని ఎంచుకోవాల‌న్నారు. అంతే కానీ వారి నిర్ణ‌యంపై ప్ర‌తి స‌వాళ్లు విసురుకోవ‌డం వ‌ల్ల నా అహం సంతృప్తి ప‌డొచ్చేమోగానీ దాని ప్ర‌భావం మాత్రం నా నిర్మాత‌లు, పంపిణీదారులు, అభిమానుల‌పై ప‌డుతుంది.

అది గ‌మ‌నించి వెన‌క్కి త‌గ్గ‌డంలో త‌ప్పులేద‌న్నారు. ఇత‌రుల‌పై స్పందించ‌డం కంటే దాని వ‌ల్ల ఎదుర‌య్యే ప‌ర్య‌వ‌సానాల‌ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడ‌టం మంచిద‌న్నారు. ఏపీ సీఎం, ప్ర‌భుత్వం టాలీవుడ్ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల చిరు చాలా డిప్ల‌మాటిక్ గా, చాలా క్యాలిక్కులేటెడ్ గా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.