Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఫింగరింగ్ ఎక్కువైందా?

By:  Tupaki Desk   |   26 April 2020 2:30 PM GMT
మెగాస్టార్ ఫింగరింగ్ ఎక్కువైందా?
X
డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అని అంటూ ఉంటారు. చాలా మంది ఇది నిజం అని నమ్ముతుంటారు. కానీ చాలా తక్కువ మంది కి మాత్రమే అలా కెప్టెన్ బాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగతా వారికి మాత్రం హైకమాండ్ ఉంటుంది. వారు హైకమాండ్ యస్ అంటే యస్.. నో అంటే నో అనే బాపతు డైరెక్టర్లు. ఎవరో కొద్ది మంది స్టార్ హీరోలు తప్ప మిగతా వారందరూ డైరెక్టర్ల పనిలో వేలు పెడతారని అడపాదడపా కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి పైన కూడా ఇలాంటి కామెంట్లు ఉన్నాయి.

అయితే సాధారణ ప్రేక్షకుల్లో ఈ వ్యవహారాలు ఎవరికీ తెలియవు కానీ ఇండస్ట్రీతో టచ్ ఉన్న వారికి.. ఇండస్ట్రీ వ్యవహారాలు తెలిసిన వారికి మాత్రం మెగాస్టార్ ఫింగరింగ్ గురించి చక్కగా తెలుసు. గతంలో కూడా చిరు తన సినిమాల విషయంలో జోక్యం చేసుకునేవారే కానీ రీ ఎంట్రీ తర్వాత మాత్రం అది చాలా ఎక్కువైందట. ఈ విషయం ఆయన సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న 'ఆచార్య' విషయంలో కూడా ఇదే జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. దీంతో దర్శకుడు కొరటాల చాలాకాలంగా ఇబ్బంది పడుతున్నారని అది వాస్తవమే అంటున్నారు. అయితే మెగాస్టార్ పై గౌరవంతో.. అభిమానంతో కొరటాల చాలా రోజులుగా ఓపిక పడుతున్నారట.

ఇప్పటికే ఈ సినిమా కథలో మెగాస్టార్ పలు మార్పులు చేర్పులు సూచించారట. ఆయనపై గౌరవంతో ఆ మార్పులు చేర్పులు అన్నీ కొరటాల చేశారట. అయితే లేటెస్ట్ గా డైలాగ్ వెర్షన్ లో ఛేంజెస్ చెప్పడంతో ఆ మీటింగ్ నుంచి కొరటాల కాస్త అసహనంగానే బయటకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. నిజానికి చిరంజీవి తన ప్రతి మాటకు యస్ బాస్ అనే దర్శకులని ఎంచుకుంటారని కూడా ఒక టాక్ ఉంది. అలాంటి వారికి మళ్లీమళ్లీ అవకాశాలు ఇస్తున్నారట. చిరంజీవి రీఎంట్రీ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చిరంజీవి నటించబోయే 154 వ సినిమాకు వినాయక్ కు మరో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అంతేలే అన్నయ్య.. షాట్ ఓకే.. లాంటివి చెప్పే డైరెక్టర్ ఉంటేనే మెగాస్టార్ కి కంఫర్ట్ గా ఉంటుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.