Begin typing your search above and press return to search.

ఆ అడ్డుగోడని చిరు కూలగొడతారా?

By:  Tupaki Desk   |   30 Nov 2017 12:11 PM GMT
ఆ అడ్డుగోడని చిరు కూలగొడతారా?
X
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిపోతున్నారు. ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీకి అండగా ఉన్న ఆయన.. దాసరి హఠాన్మరణం తర్వాత టాలీవుడ్ కి ఆపద్బాంధవుడులు అని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. స్మాల్ ఫిలిం మేకర్స్ నుంచి పలువురు టెక్నీషియన్స్ వరకూ తమ కోరికలను.. సమస్యలను చిరు దృష్టికి తీసుకొస్తున్నారు.

వీలైనంత వరకూ వీటిపై తన సాయం చేస్తున్నారు చిరు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. చిరంజీవిని కలవడంలో ఓ సమస్య మాత్రం అనేక మందిని వేధిస్తోంది. దాసరిని కలవడం అంటే.. నేరుగా ఆయన ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టే అవకాశం ఉండేది. చిరంజీవి విషయంలో ఇది సాధ్యం కాదు. ముందుగా అపాయింట్ మెంట్ తీసుకుని.. సెక్యూరిటీ చెకప్ పూర్తి చేసుకుని మాత్రమే వెళ్లాలి. ప్రస్తుతం ఎంపీ కాబట్టి కొన్నాళ్లు సెక్యూరిటీ తప్పదు. కానీ కార్పొరేట్ స్టైల్ అపాయింట్మెంట్ కల్చర్ అందరికీ వంటబట్టడం లేదు.

ఈ కల్చర్ పై అవగాహన ఉన్నవారికి చిరు అపాయింట్మెంట్ త్వరగానే లభిస్తోంది కానీ.. మిగిలినవారికి మాత్రం ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీకి అండగా నిలిచే వ్యక్తిగా మారేందుకు.. ఈ తరహా అడ్డుగోడలను చిరంజీవి బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందనే టాక్ వినిపిస్తోంది.