Begin typing your search above and press return to search.
హైదరాబాద్ సరే.. వైజాగ్ లో మెగా ఫిలింస్టూడియో ఎపుడు?
By: Tupaki Desk | 17 Oct 2020 7:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి తన జీవిత చరమాంకాన్ని ప్రశాంత నగరం బీచ్ సొగసుల విశాఖలో గడిపేస్తానని అప్పట్లో ప్రకటించారు. ఆ క్రమంలోనే చిరంజీవి (65) హైదరాబాద్ నుంచి వైజాగ్ కి షిఫ్టవుతున్నారని ప్రచారమైంది. అయితే ఇప్పటివరకూ ఆయన అలాంటి ప్రయత్నాలేవీ చేయకపోయినా.. ఎప్పటికీ విశాఖ నగరం ఆయన ఫేవరెట్ డెస్టినీ.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్భలంతా విశాఖ నగరంలో మరో టాలీవుడ్ ని నిర్మించేందుకు .. బీచ్ సొగసుల నడుమ ఫిలిం స్టూడియోని నిర్మించేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చారని ఇటీవల మీడియా కథనాలొచ్చాయి. విశాఖలో చిరంజీవి ఫిలింస్టూడియోస్ కి జగన్ భూముల్ని కేటాయిస్తారని పలువురు సినీ ప్రముఖులకు కేటాయించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని ప్రచారమైంది.
అయితే దీనిపై తాజా అప్ డేట్ ఏదీ వినిపించలేదు. సీఎం జగన్ తో మరో భేటీ ఉంటుందని చిరంజీవి ఇంతకుముందు `మా` మీటింగ్ వేదికపై ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ అలాంటిదేమీ జరగలేదు. తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ మరో ప్లాన్ ని తెరపైకి తెచ్చారట.హైదరాబాద్ ఔటర్ లో ఆయన ఓ ఫిలింస్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారని సమాచారం. ఈ ప్లాన్ ఇప్పటిది కాదు. చాలా కాలంగా ఉన్నదే. కానీ ప్రతిసారీ ఏదో ఒక కారణంతో ప్లానింగ్ దశలోనే ఆగిపోవడం నిరాశపరిచింది. ఈసారి మాత్రం అలా జరగకుండా చిరు ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారట.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పదెకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడియో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అక్కినేనీస్ అన్నపూర్ణ ఏడెకరాల తరహాలో ఇండోర్ షూటింగులకు అనువుగా ఇది నిర్మిస్తారట. ఇక కాటేజెస్ లో నాలుగు ఫ్లోర్లు నిర్మించనున్నారని సమాచారం. సినిమా టీవీ షూటింగులు రియాలిటీ షోలకు అనువుగా ఇది ఉంటుందట. ఇక అన్నపూర్ణ ఏడెకరాల్లో అయితే ఆర్టిస్టులకు మేకప్ రూమ్ లు రిలాక్స్ అయ్యేందుకు విశ్రాంతి రూమ్ లు కూడా ఉన్నాయి. అలాంటివి మెగా స్టూడియోలోనూ ఉండనున్నాయట. మరోవైపు అల్లు అరవింద్ గండిపేట్ ఏరియాలో భారీ స్టూడియో నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం విధితమే. ఆ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మెగా ఫిలింస్టూడియో ప్లాన్ టాలీవుడ్ సర్కిల్స్ లో హీట్ పెంచుతోంది. అయితే వైజాగ్ లో ఫిలింస్టూడియో ఎప్పటికి నిర్మిస్తారు? ఆ ప్లాన్ ఇప్పట్లో ఉందా లేదా? అన్నది మెగాస్టార్ స్వయంగా వెల్లడిస్తారేమో చూడాలి.