Begin typing your search above and press return to search.
ఆ ‘మెగా’ క్షణాలు వచ్చేశాయ్
By: Tupaki Desk | 28 Sep 2015 7:29 AM GMTఎప్పుడో ఆరేళ్ల కిందట తెరపై ఓ ఐదు నిమిషాలు మెరిసి మాయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. మళ్లీ ఇన్నేళ్లకు వెండితెరను వర్ణమయం చేయడానికి వస్తున్నాడు. మరి ఇన్నేళ్ల తర్వాత కెమెరా ముందుకొస్తుంటే వ్యవహారం మామూలుగా ఉంటుందా? ఉండదు గాక ఉండదు. అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఓ రేంజిలో ఉంటే తప్ప ఆ సన్నివేశాలు కిక్కివ్వవు. అందుకే ‘మెగా’ సన్నివేశాల షూటింగ్ భారీ స్థాయిలోనే ప్లాన్ చేశాడట శ్రీను వైట్ల. హైదరాబాద్ లోని హైటైక్స్ పరిసరాల్లో కళ్లు చెదిరే వాతావరణంలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
మెగాస్టార్ ఎంట్రీకి సంబంధించిన సన్నివేశాల్లో హెలికాఫ్టర్లు - గుర్రాలతో పాటు అభిమాన సందోహాన్ని కూడా భారీ స్థాయిలో చూపించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం అభిమాన సంఘాలతో మాట్లాడి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో ఫ్యాన్స్ ను రప్పించారట. ఇంద్ర - స్టాలిన్ సినిమాల స్థాయిలో భారీ సంఖ్యలో అభిమానుల మధ్య ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట. చిరంజీవి మెస్మరైజింగ్ లుక్ తో ఈ సన్నివేశాలకు సిద్ధమయ్యారని.. ఆయనో పది పదిహేనేళ్లు చిన్నవాడిలా కనిపించాడని ఓ పీఆర్వో చెబుతున్నారు. మెగాస్టార్ కనిపించే 15 నిమిషాల ఎపిసోడ్ ను కేవలం మూడు రోజుల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు శ్రీను వైట్ల. పక్కా ప్రణాళికతో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబరు 16న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఏడో తారీఖు కల్లా షూటింగ్ పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. చిరు పార్టుకు సంబంధించిన సన్నివేశాల్ని పూర్తి చేసి రెండో తారీఖున ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు.