Begin typing your search above and press return to search.

NBK-MB జోడీని మెగాస్టార్ ఆహ్వానించ‌లేదా?

By:  Tupaki Desk   |   17 Aug 2021 6:30 AM GMT
NBK-MB జోడీని మెగాస్టార్ ఆహ్వానించ‌లేదా?
X
సినీఇండ‌స్ట్రీ క్రైసిస్ నేప‌థ్యంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఇంట సినీపెద్ద‌లు భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌లు స‌హా ఇండ‌స్ట్రీకి ఉన్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి సీఎంని క‌లిసేందుకు ఈ స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఈ భేటీపై ర‌క‌ర‌కాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. మెగాస్టార్ ఇంట భేటీలో కేవ‌లం బాస్ కి స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ .. మంచు మోహ‌న్ బాబు వంటి సినీప్ర‌ముఖుల‌ను ఎందుక‌ని ఆహ్వానించ‌లేదు? అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే త‌న ఇంట జ‌రిగిన‌ స‌మావేశానికి త‌న‌కు స‌న్నిహితులైన ద‌ర్శ‌కుల‌నే పిలుచుకుంటారా? మెహర్ రమేష్.. కొరటాల.. వినాయక్ వీళ్లేనా ప్ర‌ముఖులు ఇత‌ర ద‌ర్శ‌కులు ఏమ‌య్యారు? అంటూ లాజిక్కులు వెతికారు. అయితే వీట‌న్నిటి కంటే అంద‌రి దృష్టి ఒక విష‌యంపై ప‌డింది. NBK-MB జోడీని మెగాస్టార్ కావాల‌నే ఆహ్వానించ‌లేదు అంటూ ప్రచారం సాగిపోతోంది.

అయితే ఇది నిజ‌మా? మెగాస్టార్ నిజంగానే ఆ ఇద్ద‌రినీ ఆహ్వానించ‌లేదా? ఒక‌వేళ ఆహ్వానించినా వారు స్కిప్ కొట్టారా? అంటూ మ‌రో గుస‌గుస వేడెక్కిస్తోంది. అయితే ఇంత‌కుముందు ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీకి త‌మ‌ను ఆహ్వానించ‌లేద‌ని నంద‌మూరి బాల‌కృష్ణ ఆరోపించారు. భూములు పంచుకునేందుకే ఈ మీటింగులు అంటూ ఎద్దేవా చేశారు. అయినా ఇప్పుడు కూడా ఆయ‌న కీల‌క భేటీల్లో క‌నిపించ‌డం లేదు. నిజానికి చిరు బృందం బాల‌య్య‌ను అవాయిడ్ చేశారా? ఇక‌పోతే ఇటీవ‌ల క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం పెద్ద‌లుగా ఉన్న చిరు-మోహ‌న్ బాబు క‌లిసి రాక‌పోవ‌డం ఏమిటీ? అంటూ ఆరాలు వేడెక్కిస్తున్నాయి. అయితే దీనిపై ఇదీ నిజం అంటూ అధికారికంగా మెగా కాంపౌండ్ ఏదైనా వివ‌ర‌ణ ఇస్తుందా? అన్న‌ది చూడాలి.

భేటీకి హాజ‌రైన పెద్ద‌లు ఎవ‌రెవ‌రు?

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో తెలుగు ఫిలించాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్- కింగ్ నాగార్జున- అల్లు అరవింద్, సురేష్ బాబు- ఆర్. నారాయణమూర్తి- దిల్ రాజు- కే.ఎస్ . రామారావు - దామోదర్ ప్రసాద్- ఏషియన్ సునీల్- స్రవంతి రవికిశోర్ - సి. కళ్యాణ్- ఎన్వీ ప్రసాద్- కొరటాల శివ- వి.వి.వినాయక్- జెమిని కిరణ్- సుప్రియ భోగవల్లి బాబీ యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ ఇలా..నిర్మాత‌ల సంఘం.. పంపిణీ- ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు.

ఇంత‌కీ ఏం చ‌ర్చించారు అంటే..?

సినీపెద్ద‌ల భేటీలో ఇటీవ‌ల ఏపీలో వ‌చ్చిన జీవోలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. సీఎంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాలేమిటి? అన్న‌దానిపై చ‌ర్చించారు. అన్నిటికీ త్వరగా ప‌రిష్క‌రించాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్ తెర‌పైకొచ్చింది. చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌పైనా సీఎంతో భేటీలో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించారు.

ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ తో భేటీలో టిక్కెట్టు రేట్ల‌పై చ‌ర్చించ‌నున్నారు. గ్రామ పంచాయితీ- న‌గ‌ర పంచాయితీ- కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ఏం అడ‌గాలి? చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో విషయమై చర్చించాల‌ని నిర్ణ‌యించారు. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిపై సానుకూల వాతావరణం వచ్చేలా ఓ కొలిక్కి వచ్చేలా ప్ర‌య‌త్నం సాగాల‌ని నిర్ణ‌యించారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ విశాఖ‌లో అభివృద్ధి చేయ‌నున్న స‌రికొత్త టాలీవుడ్ అంశాన్ని కూడా ఈ భేటీలో ప్ర‌స్థావించే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పరిశ్రమలో అన్ని విభాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి సీఎంతో కూలంకుషంగా చర్చించాల‌ని భావిస్తున్నారు. అయితే ఈ భేటీలో కీల‌క స‌భ్యులు బాల‌కృష్ణ‌- మోహ‌న్ బాబు మిస్స‌వ్వ‌డంపైనే అంద‌రికీ ప‌లు సందేహాలున్నాయి. మ‌రి వాట‌న్నిటినీ చిరు స్వ‌యంగా నివృత్తి చేస్తార‌నే భావిద్దాం.