Begin typing your search above and press return to search.

చిరు.. బాలయ్య.. నో హైద్రాబాద్??

By:  Tupaki Desk   |   10 Dec 2016 5:29 AM GMT
చిరు.. బాలయ్య.. నో హైద్రాబాద్??
X
సంక్రాంతికి ఇంకా నెలరోజులుంది. కానీ మెగా- నందమూరి అభిమానులకి మాత్రం అప్పుడే పండగ మొదలైపోయింది. బాక్సాఫీస్ దగ్గర పందెం కోళ్లలా పోటీ పడటానికి బడా హీరోలు రెడీ అయ్యారు. ఏళ్ల తర్వాత చిరు- బాలక్రిష్ణ పండగ పోటీ ఎలా ఉంటుందో చూపించడానికి ప్రిపేరవుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ హీరోలిద్దరూ తమ తమ సినిమాలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్.. టీజర్స్ రిలీజ్ చేశారు. సబ్జెక్ట్స్ కి తగ్గట్టే రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఇక మరో స్టెప్ పడబోతుంది. అదే ఆడియో రిలీజ్.

సాధారణంగా ఆడియో విడుదల కార్యక్రమాలంటే మనకి ఏ హైద్రాబాద్ లోని ఏ శిల్పాకళా వేదికో.. హైటెక్స్ లోనే జరగడం ఆనవాయితీ. గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయం. అయితే ఈ మధ్య పెద్ద హీరోల సినిమాల ఆడియో రిలీజ్ లు.. మూవీ ప్రీ అండ్ పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్ విజయవాడ.. విశాఖ.. తిరుపతి లాంటి ప్లేసెస్ వేదికలవుతున్నాయ్. ఇప్పుడు చిరు.. బాలక్రిష్ణ కూడా ఇదే రూట్లో వెళతున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియోని తిరుపతిలో విడుదల చేయనున్నారు. 16 అని డేట్ చెప్పినప్పటికీ కొంచెం డైలమా నడుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ వస్తే తిరుపతిలో బాలయ్య అభిమానుల హంగామా మొదలైనట్టే.

ఇటు చిరంజీవి- ఖైదీ నెంబర్ 150 ఆడియో రిలీజ్ ఈ నెల 25న విజయవాడలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఊపందుకున్నాయ్. చిరంజీవి- విజయవాడంటే చాలామందికి ఇంద్ర విజయోత్సవ సభే గుర్తొస్తుంది. అప్పుడు వచ్చిన అభిమానుల సంఖ్య గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారంటే చిరు ఫ్యాన్ బేసేంటో కొత్తగా చెప్పక్కర్లేదు. పైగా ఖైదీనెంబర్ 150 బాస్ కి కమ్ బ్యాక్ మూవీ. సో ఈ సారి ఆ నెంబర్ ని ఊహించలేమేమో. అందుకే ఇప్పుడు మెగా అభిమానులంతా 25 కోసం ఎదురుచూస్తున్నారు. మరి ప్రీ-ప్లానో.. కో-ఇన్సిడెన్సో కానీ అగ్రహీరోలిద్దరూ ఇలా హైద్రాబాద్ అవతల ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయడం మాత్రం సర్ ప్రైజే.