Begin typing your search above and press return to search.
చిరు స్టామినా.. 8 రోజుల్లోనే 80 కోట్ల షేర్
By: Tupaki Desk | 19 Jan 2017 1:31 PM GMTతన కంబ్యాక్ మూవీతో చిరంజీవి ఏ మాత్రం షేర్ రాబడతారు? తన తర్వాతి తరం స్టార్ హీరోల మాదిరిగా వసూళ్లు సాధించగలరా? కనీసం 50 కోట్ల షేర్ అయినా వసూలు చేయలేక పరువు పోగొట్టుకుంటారా? ఇలాంటి ఎన్నెన్నో అనుమానాల మధ్య మెగాస్టార్ 150వ సినిమా షూటింగ్ మొదలైంది.
ఈ అనుమానాలన్నీ రిలీజ్ రోజుతోనే పటాపంచలు అయిపోగా.. ఇప్పుడు కేవలం 8 రోజుల్లోనే 80 కోట్ల షేర్ వసూలు చేసి టాలీవుడ్ లో తన రేంజ్ ఏంటో చూపించారు చిరంజీవి. ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేసుకుంటూ వస్తున్న చిరు ముందు.. ఇంకా శ్రీమంతుడు.. బాహుబలి మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వసూళ్లు కొనసాగుతున్న జోరు.. ఇంకా చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్స్ పడుతుండడం చూస్తే.. ఇంకా ఒకే ఒక్క రోజులో శ్రీమంతుడు రికార్డ్ బద్దలైపోనుంది.
ఇది కాకుండా ఇంకా రెండు వీకెండ్స్ పాటు థియేటర్స్ లో రచ్చ చేసే ఛాన్స్ ఉండడంతో.. మెగాస్టార్ ఈజీగా వంద కోట్ల షేర్ మార్కును దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ సినీ రంగంలోకి ఎలా ఉంటుందో.. పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి ప్రూవ్ చేసుకున్న తీరును ఎన్ని ప్రశంసలు కురిపించినా తక్కువే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/