Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్ర అయిపోయింది.. సీమపై పడ్డాడు
By: Tupaki Desk | 30 Jan 2017 11:38 AM GMTతెలుగు సినిమా మార్కెట్ స్థాయిని అమాంతం పెంచేసిన బాహుబలి లాంటి మెగా మూవీ సైతం ఉత్తరాంధ్రలో రూ.10 కోట్ల మార్కును అందుకోలేదు. ఆ సినిమా రూ.9 కోట్ల లోపే షేర్ కలెక్ట్ చేసింది. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ తొలిసారిగా ఉత్తరాంధ్రలో రూ.10 కోట్ల షేర్ తో చరిత్ర సృష్టించింది. ఇక్కడ ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.12 కోట్ల షేర్ సాధించేలా ఉంది. దీని తర్వాత రాయలసీమలోనూ అనితర సాధ్యమైన రికార్డు దిశగా సాగుతున్నాడు చిరు. నాన్-బాహుబలి సినిమాల్లో ఇప్పటిదాకా ఏది కూడా రాయలసీమలో రూ.15 కోట్ల షేర్ మార్కును అందుకున్నది లేదు. ఐతే చిరు సినిమా ఆ ఘనత సాధించేలా ఉంది.
సీడెడ్లో ఇప్పటిదాకా ‘ఖైదీ నెంబర్ 150’ రూ.14.65 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ థియేటర్లలోనే సినిమా ఆడుతోంది కాబట్టి ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.15 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమే. బాలయ్య సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రాయలసీమలో అదరగొట్టినా.. దాని పోటీని తట్టుకుని చిరంజీవి సినిమా రూ.15 కోట్ల మార్కును అందుకోవడం విశేషమే. ఒక్క నైజాం మినహాయిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లోనూ నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టేసింది ‘ఖైదీ నెంబర్ 150’. పదేళ్ల విరామం తర్వాత వచ్చిన చిరు ఈ స్థాయిలో వసూళ్ల మోత మోగించడం విశేషమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/