Begin typing your search above and press return to search.
అరవింద్ చెప్పిన బాస్ ఫస్ట్ డే కలెక్షన్ లెక్క
By: Tupaki Desk | 12 Jan 2017 5:57 PM GMTపాతిక కోట్లు.. కాదు రూ.30 కోట్లు.. కాదు కాదు రూ.37 కోట్లు. ఇదీ సినీజీవులుచెప్పిన బాస్ ఫస్ట్ డే కలెక్షన్ లెక్కలు. అయితే.. అంతకు మించి అన్నట్లుగా అసలులెక్కల్ని అఫీషియల్ గా వెల్లడించారు అల్లు అరవింద్. అందరి లెక్కలకుమించినట్లుగా అరవింద్ లెక్క ఉండటం విశేషంగా చెప్పాలి. తొమ్మిదేళ్ల విరామంతర్వాత చిరు సినిమా విడుదల కావటంతో మెగా అభిమానులంతా థియేటర్లకుపోటెత్తారన్న అరవింద్.. మొట్టమొదటి రోజు గ్రాస్ కలెక్షన్ రూ.47.7 కోట్లుగా లెక్కతేల్చారు.
ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ సాధించిన హయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్ గా అరవింద్వెల్లడించారు. ఈ రికార్డు వసూళ్లు చరిత్ర సృష్టించిందని చెప్పారు. తాజాగా ప్రెస్మీట్ పెట్టిన ఆయన.. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలైన కలెక్షన్లురూ.30.04కోట్లుగా చెప్పిన అరవింద్ కర్ణాటకలో రూ.4.7కోట్లు.. ఓవర్సీస్ లో 1.22మిలియన్ డాలర్లుగా చెప్పారు. అమెరికా మినహా మిగిలిన చోట్ల 3,20,000డాలర్లుగా.. నార్త్ అమెరికాలో రూ.8.90 కోట్లు.. భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోరూ.2.12 కోట్లు.. ఓరిస్సాలో రూ.12లక్షలు.. తమిళనాడు నుంచి రూ.20లక్షలవసూళ్లతో మొత్తంగా రూ.47.7కోట్ల రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకున్నట్లుచెప్పారు.
చిరంజీవిని చూడాలన్న ఆత్రుతతో థియేటర్లకు అభిమానులు పోటెత్తారని..ఓవర్సీస్ లోనూ ప్రేక్షకుల స్పందన చాలా బాగుందని.. పండుగ మాదిరి ఆఫీసులకుసెలవులు పెట్టి మరీ థియేటర్లకు వచ్చారని.. ఇదంతా చిరంజీవిని చూసేందుకేననిఆయన చెప్పారు. అదిరిపోయే ఓపెనింగ్స్ తో షురూ అయిన బాస్ కలెక్షన్ల జర్నీ..రానున్న రోజుల్లో మరెన్ని రికార్డులు బద్ధలవుతాయో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/