Begin typing your search above and press return to search.
ఖైదీ కౌంటింగ్.. అప్పుడే 120 దాటింది
By: Tupaki Desk | 24 Oct 2016 5:28 AM GMTఖైదీ నెంబర్ 150.. టాలీవుడ్ ఇప్పుడు సెన్సేషన్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిపోతోందీ మెగామూవీ. ఇండస్ట్రీలో టాప్ హీరోలందరూ ఇప్పటివరకూ అందుకోవడానికి తాపత్రయపడుతున్న ఓ ల్యాండ్ మార్క్ ను.. మెగాస్టార్ అవలీలగా ప్రి రిలీజ్ బిజినెస్ తోనే అందుకోవడం చాలామందికి కోలుకోలేని షాక్ ని ఇస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ పవర్ ఏంటో ఖైదీ నెంబర్ 150 కి జరుగుతున్న బిజినెస్ చూస్తే అర్ధమవుతుంది.
వైజాగ్.. ఈస్ట్.. వెస్ట్ గోదావరి ఏరియాల్లో ఇప్పటికే ఆల్ టైం రికార్డ్ రేట్లకు ఖైదీ నెంబర్ 150 హక్కులను విక్రయించారు. ఇక నైజాం ఏరియా.. కృష్ణా జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల పార్ట్నర్ షిప్ బేసిస్ పై గీతా ఫిలిమ్స్ విడుదల చేయనుంది. ఇప్పటివరకూ అందుతున్న లెక్కల ప్రకారం.. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ మెగా150 మూవీ 62 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంటోంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమాతో పోల్చినా ఇదే అత్యధికం కాగా.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 100 కోట్ల వ్యాపారం చేసేస్తున్నాడు ఖైదీ.
ఇక శాటిలైట్.. ఆడియో.. డబ్బింగ్ (ఆల్రెడీ రీమేక్ కాబట్టి.. ఇక ఆ ఛాన్స్ లేదు) రూపంలో మరో 20 కోట్లు సమకూరనున్నాయట. మొత్తంగా ఖైదీ కౌంటింగ్ ఇప్పటికే 120 కోట్లను దాటిపోవడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/