Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కాదు.. బాక్సాఫీస్ బాస్

By:  Tupaki Desk   |   13 Jan 2017 9:11 AM GMT
మెగాస్టార్ కాదు.. బాక్సాఫీస్ బాస్
X
లేటుగా వచ్చినా సరైన టైమ్ కే వస్తానన్నట్లుగా ఉంది మెగాస్టార్ చిరంజీవి వ్యవహారం. తొమ్మిదేళ్లు ముఖానికి మేకప్ వేసుకోకుండా ఉన్న ఆయన.. తన 150వ చిత్రంగా నటించిన ఖైదీ నంబరు 150 విడుదలై.. బాక్స్ ఫీస్ దగ్గర చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతిచోటా కలెక్షన్ల కుంభవృష్టి కురుస్తోంది. సరికొత్త రికార్డుల్నిక్రియేట్ చేస్తూ.. బాక్స్ ఫీస్ ను షేక్ చేస్తున్న చిరు సినిమాను చూస్తే.. ఆయన్ను మెగాస్టార్ అనే కంటే బాక్స్ ఫీస్ బాస్ అని పిలిస్తే బాగుండనిపించక మానదు.

ఏరియాల వారీగా కలెక్షన్ల లెక్క చూస్తే..

ఏరియా ఫస్ట్ డే షేర్ (కోట్లల్లో)

వైజాగ్ 2.59 (ఆల్ టైం రికార్డు)

ఈస్ట్ 3.50 (ఆల్ టైం రికార్డు)

వెస్ట్ 3.00(ఆల్ టైం రికార్డు)

కృష్ణా 1.59(ఆల్ టైం రికార్డు)

గుంటూరు 2.79(ఆల్ టైం రికార్డు)

నెల్లూరు 1.00(ఆల్ టైం రికార్డు)

మొత్తంగా ఆంధ్రా వరకు రూ.14.47కోట్లు. ఇదో ఆల్ టైం రికార్డు. ఇక.. అంచనా వేస్తున్న గ్రాస్ లెక్క చూస్తే ఇది సుమారుగా రూ.18.8 కోట్లుగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇక.. సీడెడ్ లెక్కలోకి వెళితే తొలి రోజు రూ.4కోట్లు.. గ్రాస్ రూ.4.7కోట్లుగా తెలుస్తోంది. నైజాం విషయానికి వస్తే.. 4.77 ఫస్ట్ డే కలెక్షన్ కాగా.. గ్రాస్ రూ.6.5కోట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఏపీ.. నైజాం కలిపితే ఆల్ టైం రికార్డు కలెక్షన్ రూ.23.24 కోట్లు కాగా.. గ్రాస్ రూ.30కోట్లుగా లెక్క తేలింది.

ఇదిలా ఉంటే.. యూఎస్ గ్రాస్ కలెక్షన్ రూ.9.6కోట్లుగా చెబుతున్నారు. కర్ణాటక గ్రాస్ రూ.7.5కోట్లు కాగా.. దేశంలోని మిగిలిన ప్రాంతాలు అమెరికా మినహా మిగిలిన ప్రపంచంలో విడుదలైన చోట్ల మొదటి రోజు గ్రాస్ కలెక్షన్లు రూ.3.35కోట్లుగా తేలినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ రూ.35కోట్లు అయితే.. గ్రాస్ రూ.50.45కోట్లుగా చెబుతున్నారు.

ఇక.. తెలుగు తమిళ చిత్రాల్లో వసూళ్ల వర్షం కురిసిన టాప్ టెన్ చిత్రాలు చూస్తే.. బాస్ ఖైదీనే నిలుస్తుంది. ఎందుకంటే.. ఖైదీకి ముందుగా ఉన్న కబాలి.. బాహుబలి రెండూ హిందీ.. తమిళ్ వెర్షన్ ఉండటం మర్చిపోకూడదు. అలాంటప్పుడు అచ్చంగా తెలుగులో మాత్రమే విడుదల చేసిన లెక్కలోకి తీసుకుంటే.. ఖైదీ మొదటి స్థానంలో నిలుస్తుందనటంలో సందేహం లేదు. కావాలంటే ఈ లెక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది.

1. కబాలి రూ.87.5 కోట్లు (అంచనా) (తమిళ్.. తెలుగు.. హిందీ)

2. బాహుబలి రూ.73 కోట్లు(అంచనా) (తెలుగు.. తమిళ్.. హిందీ.. మలయాళం)

3. ఖైదీ నంబరు 150 రూ.50.45కోట్లు (అంచనా) (రీమేక్) (తెలుగు)

4. జనతా గ్యారేజ్ రూ.41 కోట్లు (అంచనా) (తెలుగు.. మలయాళం)

5. సర్దార్ గబ్బర్ సింగ్ రూ.40.8కోట్లు (అంచనా) (తెలుగు.. హిందీ)

6. లింగ రూ.39 కోట్లు (అంచనా) (తమిళ్.. తెలుగు)

7. శంకర్ ఐ రూ.36కోట్లు (అంచనా) (తమిళ్.. తెలుగు)

8. శ్రీమంతుడు రూ.33కోట్లు(అంచనా) (తెలుగు.. తమిళ్)

9. రోబో రూ.30కోట్లు (అంచనా) (తమిళ్.. తెలుగు.. హిందీ)

10. మురగదాస్ తెరి రూ.28.46 కోట్లు(అంచనా) (తమిళ్.. చెంగల్ పేటలో ఏరియాలో రిలీజ్ కాలేదు)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/