Begin typing your search above and press return to search.
తొలి రోజు చిరు మోత మోగించేస్తాడా..
By: Tupaki Desk | 6 Jan 2017 10:30 PM GMTచిరంజీవి సినిమాల్లో కొనసాగినంత కాలం ఆయనే నెంబర్ వన్. టాలీవుడ్లో ఏ రికార్డయినా ఆయన పేరిటే ఉండేది. ఎవరైనా తన రికార్డును బద్దలు కొట్టినా మళ్లీ చిరు ఆ రికార్డును సొంతం చేసుకునేవాడు. ఐతే చిరు సినిమాల నుంచి నిష్క్రమించాక పరిస్థితులు మారిపోయాయి. రికార్డుల కోసం చాలామందే పోటీలో నిలిచారు. అసలు చిరు ఉన్నప్పటికి.. ఆ తర్వాతి కాలానికి రికార్డుల లెక్కల్లో కూడా మార్పులొచ్చేశాయి. ఒకప్పుడు 100 డేస్ సెంటర్లను బట్టి సినిమా స్థాయి ఏంటో చూసేవాళ్లు. కానీ ఇప్పుడంతా కలెక్షన్లే రికార్డులకు ప్రామాణికం అయ్యాయి. తొలి రోజు ఎంత వసూలు చేసింది.. తొలి వారాంతం.. తొలి వారం.. ఫుల్ రన్లో ఎంత.. షేర్ ఎంత.. గ్రాస్ ఎంత.. ఈ లెక్కల మీదే రికార్డులు నడుస్తున్నాయి.
ఇలాంటి టైంలో చిరు తన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ఈ సినిమా గురించి గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. మరి చిరు కూడా ఇప్పటికీ తనే ‘బాక్సాఫీస్ బాస్’ అని రుజువు చేసుకుంటాడేమో చూద్దామని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ మీద ఉన్న హైప్ ప్రకారం చూస్తే ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడానికి కొంత వరకు అవకాశాలున్నాయి.
ఈ నెల 11న సోలోగా రిలీజవుతోంది కాబట్టి తొలి రోజు వసూళ్ల రికార్డును చిరు సినిమా కొల్లగొట్టడానికి ఛాన్సుంది. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌కు తోడు సంక్రాంతి సెలవుల్లో రిలీజవుతుండటం వల్ల మిగతా రెండు సినిమాల పోటీని తట్టుకుని కూడా ‘ఖైదీ నెంబర్ 150’ భారీగానే వసూళ్లు రాబట్టేందుకు అవకాశం ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ‘శ్రీమంతుడు’ కలెక్షన్లను కూడా చిరు సినిమా దాటేయొచ్చు. సంక్రాంతి నుంచి టికెట్ల రేట్లు పెరుగుతాయన్న వార్తలు కూడా నిజమైతే ఈ విషయంలో ఢోకానే లేకపోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/