Begin typing your search above and press return to search.
బుల్లితెరను మెగా స్టార్ రఫ్ ఆడించాడు
By: Tupaki Desk | 30 May 2017 4:57 AM GMTమెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ప్రభంజనం మనం చూశాం. యూట్యూబ్ లో అతడు చేసిన కుమ్ముడు మరి ఎవరికి సాధ్యం కానంతగా మేటి రికార్డులు నెలకొల్పాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువగానే దుమ్మురేపాడు తన బాక్స్ ఆఫీసు కలెక్షన్లుతో. ''ఖైదీ నెం 150'' అంటూ 100 కోట్ల క్లబ్ చాలా ఈజీ అని ప్రూవ్ చేశాడు.
ఇకపోతే ఆదివారం నాడు మన జనాలు ఇంట్లో ఉన్నందరూ ఒకదగ్గరకు చేరి కలిసి టివి చూడటం మనకు తెలుసు. మొన్న సండే చిరు తాజా సినిమా ‘ఖైదీ 150’ టివిలో వేశారు. ఒక చానెల్ లో IIFA ఉత్సవం ప్రసారం అవుతున్నా.. మరొక చానల్లో జక్కన్న రాజమౌళి ఇంటర్యూ వస్తున్నా.. అందరూ చూసింది మాత్రం ‘స్టార్ మా’ లో ప్రసారమైన ‘ఖైదీ 150’ సినిమానే అని రేటింగులు చెబుతున్నాయి. సరే రేటింగుల సంగతి పక్కనెట్టేస్తే.. ఫ్యాన్స్ కోసం స్టార్ మా ఏం చేసిందో తెలుసా? ఖైదీ 150లో బాగా జనారాధన పొందిన పాటలు ‘రత్తాలు రత్తాలు’ మరియు ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటలను రెండుసార్లు ప్లే చేశారు టివి వీక్షకులు కోసం. టివి బ్రాడ్ కాస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి ఇలా జరగడం.
ఇంతకు ముందు కూడా బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి ఎంట్రీ సీన్ ను రెండు సార్లు ప్రసారం చేశారు. అప్పటిలో 100 వరోజు నాడు థియేటర్లలో ఇలా హిట్ పాటలు రెండుసార్లు వేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ రోజులును తిరిగి తెచ్చారు బుల్లి తెర పైకి మెగాస్టార్ చిరంజీవి. ఓవర్ టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/