Begin typing your search above and press return to search.

ప‌రువు పోయాక‌.. రిపేర్ల‌తో ఏం లాభం!

By:  Tupaki Desk   |   26 Oct 2019 12:26 PM GMT
ప‌రువు పోయాక‌.. రిపేర్ల‌తో ఏం లాభం!
X
`మా` అసోసియేష‌న్ వివాదం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎంతో హుందాగా ఉండాల్సిన సంఘం న‌డిరోడ్డుకెక్కుతోంద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అధ్య‌క్షుడు న‌రేష్‌తో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ & సెక్ర‌ట‌రీ జీవితా రాజ‌శేఖ‌ర్ విభేధించ‌డంతో గొడ‌వ‌ తారా స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులుగా అన్నీ మీడియా సంస్థ‌ల్లోనూ ఇదే హాట్ టాపిక్. న‌రేష్ -జీవిత రెండు వ‌ర్గాలుగా చీలిపోయి ఒక‌రిపై ఒక‌రు అధిప‌త్య పోరు చూపించే ప్ర‌య‌త్నం చేసారు. అధ్య‌క్షుడు లేకుండా మీటుంగులేమిటి? అంటూ న‌రేష్ ప్ర‌శ్నిస్తే.. ఇది సాధార‌ణ స‌మావేశ‌మ‌ని జీవిత వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం..అటుపై ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకోవడంతో వివాదం మ‌రింత ముద‌రింది. కార‌ణాలు ఏవైనా `మా ` ప‌రువు బ‌జారున ప‌డుతోంది. వాళ్ల‌లో వాళ్లు ఎన్ని మాట‌లు అనుకున్నా అంతా ఒకే కుటుంబంలా స‌ర్దుకుంటార‌ని ఇన్నాళ్లు సినీ పెద్ద‌లు భావించారు.

కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో అలా జ‌ర‌గ‌డానికి ఆస్కారం లేద‌ని తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో మా వ్య‌వ‌స్థాప‌క పెద్ద‌లు క‌ల్పించుకునే స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని తాజా మీడియా క‌థ‌నాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఈ విష‌యంపై మెగాస్టార్ చిరంజీవి- కృష్ణంరాంజు- మోహ‌న్ బాబు రంగంలోకి దిగిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ముగ్గురు ఇటీవ‌లే ఓ స్టార్ హోట‌ల్లో స‌మావేశ‌మై ఆర్టిస్టుల సంఘం లుక‌లుక‌ల‌పై చర్చించిన‌ట్లు తెలిసింది.

అంతేకాదు రెండు గ్రూపుల్ని ఒక‌చోటికి చేర్చి స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేయ‌నున్నార‌ట‌. రాజ‌శేఖ‌ర్- జీవిత‌- న‌రేష‌న్ ల‌ను పిలిపించి ఓ చోట కూచుని మాట్లాడ‌తార‌ట‌. దాంతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల‌ని నిర్ణ‌యించినట్లు సోర్స్ చెబుతోంది. దీపావ‌ళి వెళ్లిన త‌ర్వాత ఈ మీటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. అలాగే మా లో జ‌రిగే అంత‌ర్గత‌ విష‌యాలు బ‌య‌ట‌కు ఎలా పొక్కాయ‌న్న దానిపై చిరు ఆరా తీసి సీరియ‌స్ అయినట్లు స‌మాచారం. అలాగే మా భ‌వంతి నిర్మాణానికి నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌పైనా చ‌ర్చ సాగ‌నుంద‌ట‌.