Begin typing your search above and press return to search.
బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ కి మెగా ప్రేమలేఖ
By: Tupaki Desk | 3 Sep 2015 8:11 PM GMTఒక హీరో ఒక హీరోయిన్ కి ప్రేమలేఖ రాస్తే అందులో అర్థం దాగుంది. ప్రేమ దాగుంది. అదే ఒక సీనియర్ హీరో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్ కదూ? అవును అదే జరిగింది వాస్తవంలోనూ. ఈ ఎపిసోడ్ లో ఆ ప్రేమలేఖ రాసింది మెగాస్టార్ చిరంజీవి. లేఖ అందుకున్న స్టార్ ప్రొడ్యూసర్ పేరు బండ్ల గణేష్.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల కు ఇరుగు పొరుగు నుంచి, టాలీవుడ్ నుంచి బోలెడంత మంది సెలబ్రిటీలు వచ్చారు. అందులో బండ్ల గణేష్ కూడా ఉన్నారు. గణేష్ కి మెగా ఫ్యామిలీ తో అనుబంధం ఇప్పటిది కాదు. కెరీర్ ఆరంభం నుంచి అతడు మెగాభిమాని. చిరంజీవి కి వీరాభిమాని. అందుకే ఆ కుటుంబ హీరోల తో తప్ప వేరే హీరోలతో సినిమాలే తీయడు. చిరు 60వ పుట్టినరోజు వేడుక లో ఫ్యామిలీ తో వచ్చి సందడి చేసిన గణేష్‌ని ఉద్ధేశిస్తూ .. లేఖలో చిరు ఏం పేర్కొన్నారంటే...? డియర్ గణేష్.. మీరు, మీ కుటుంబ సభ్యులు కలిసి వచ్చి నా పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేసినందుకు , మంచి ఫన్నీ మూవ్‌మెంట్స్ షేర్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మీ స్నేహాని కి, అభిమానాని కి నా కృతజ్ఞతలు.. అంటూ చిరు లేఖ పంపించారు.
ఒక హీరో ఒక అభిమాని కి పంపించే లేఖను ప్రేమ లేఖ అనకుండా ఉండగలమా? అయితే ఇది గెస్టులందరికీ పంపే ఉంటారు, గణేష్ ఒక్కడికేనా అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు కూడా... కాకపోతే గణేష్ బాబు మాత్రం ఈ ఎపిసోడ్ ను బాగా ప్రచారం చేసుకుంటున్నాడు.