Begin typing your search above and press return to search.
మెగాస్టార్ షేపులు మారుతున్నాయ్
By: Tupaki Desk | 23 July 2015 7:30 AM GMTమెగాస్టార్ రీ-ఎంట్రీకి ఇంకా ఎంతో కాలం లేదు. 150వ సినిమాకి ఆగస్టు 22 ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పట్నుంచే మెగాభిమానుల్లో హడావుడి మొదలైంది. హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈలోగానే మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకా సూటిగా చెప్పాలంటే స్టన్నింగ్ లుక్ తో షాకిచ్చారు. కాస్త వివరంగా అసలు విషయంలోకి తరచి చూస్తే..
నిన్నటిరోజున గోదావరి పుష్కరాల్లో స్నానమాచరించారు మెగాస్టార్. అల్లు అరవింద్ సహా పుష్కర స్నానాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఆ టైమ్ లో మెగాస్టార్ చిరు షర్ట్ ఓపెన్ చేసి పలుచని బనియన్ లో కనిపించారు. ఆ దృశ్యంలో చిరు న్యూలుక్ చూసినవారికి ఒకటే షాకింగ్. మునుపటితో పోలిస్తే రూపురేఖల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఛాతి తీర్చిదిద్దిన ఆకృతిని సంతరించుకుంది. హ్యాండ్స్ కి బైసెప్స్, ట్రైసెప్ సర్కిల్స్ కనిపించాయి. అలాగే షోల్డర్ బ్లో అయ్యి ఆకర్షణీయంగా కనిపించింది. పొట్ట భాగం పూర్తి ఫ్లాట్ గా కనిపించింది. అంటే అన్నయ్య జిమ్ముల్లో సీరియస్ గా కసరత్తులు చేస్తున్నారన్న సంగతి అర్థమైనట్టే కదా.
సరైన టైమింగ్ తో ఆహారనియమాలు పాటిస్తూ.. ఎంతో సీరియస్ గా కసరత్తులు చేస్తేనే కానీ ఈ రూపం రావడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. చిరు మరి కాస్త కష్టిస్తే షారూక్ ఖాన్‌లా 6 ప్యాక్ చేయడం కూడా కష్టమేమీ కాదు సుమా. 150వ సినిమాకి సంబంధించిన సర్వ సన్నాహకమే ఇదంతా. మెగాస్టార్ ల్యాండ్ మార్క్ సినిమాలో మైండ్ బ్లోవింగ్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారనడానికి ఇదే నిదర్శనం. అభిమానులకు ఇది సిసలైన శుభవార్తే.