Begin typing your search above and press return to search.
బాసూ.. చూపించు నీ గ్రేసు
By: Tupaki Desk | 9 Jun 2017 7:32 AM GMTతండ్రిని మించిన తనయుడని పేరు తెచ్చుకోవడం ఎవరికైనా ఆనందమే. ప్రతి తండ్రి కోరుకునేది అదే అయినా సినిమాల విషయంలో మాత్రం ఇందుకు కాస్త మినహాయింపు తప్పదు. తన కొడుకు రామ్ చరణ్ హీరోగా రాణించినా సినిమాల విషయంలో తనతో పోటీ పడుతూనే ఉంటానని మెగాస్టార్ చిరంజీవి గతంలో చెప్పుకొచ్చారు. చెప్పినట్టుగానే ఖైదీ నెంబర్ 150లో ఓ కొత్త లుక్ తో కనిపించి అభిమానులతో విజిల్స్ వేయించారు. తర్వాత 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తీయడానికి చిరు రెడీ అవుతున్నాడు. ఈలోగా 80ల నాటి నటులందరితో కలిసి చైనా ట్రిప్ కు వెళ్లాడు. ఆ ఫోటోలన్నీ మనం చూశాం.
ఇదే టైంలో రామ్ చరణ్ ఇటీవల ఓ ప్రైవేటు ఫంక్షన్ కు హాజరయ్యాడు. కోరమీసం గెడ్డంతో చరణ్ కొత్త లుక్ వావ్ అనిపించింది. చక్కటి హెయిర్ స్టైల్ టోటల్ మ్యాన్లీ అప్పియరెన్స్ తో సూపర్ గా ఫోకస్ అయ్యాడు. అదే టైంలో చైనాలో చిరంజీవి షేర్ చేసిన చిత్రాలతోె పోలిస్తే మెగా పవర్ స్టార్ తో పోలిస్తే మెగా స్టార్ వెనుకబడిపోయాడని అనిపించక మానదు. చైనా టూర్ షేర్ చేసిన చిత్రాల్లో చిరంజీవి గడ్డంతోనే కనిపించినా అది అంతగా ఆకట్టుకునేలా లేదు. దీనికితోడు ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్లీ కాస్త లావయినట్లు కనిపిస్తోంది. చిరంజీవి- రామ్ చరణ్ ల మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నందున వాళ్లిద్దరిని పోల్చి చూడటం కరెక్ట్ కాదనిపించినా... హీరోగా రాణించాలంటే యంగ్ జనరేషన్ తో పోటీ పడక తప్పదు. ఇది స్వయానే చిరు చెప్పిన మాటే.
ఈ విషయంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మాత్రం ముందే ఉన్నాడు. లుక్ విషయంలో ఇప్పటికీ తన కొడుకులు నాగ చైతన్య అఖిల్ తో పోటాపోటీగా కనిపిస్తుంటాడు. తన ఛరిష్మా ఇప్పటికీ తగ్గలేదని ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి ప్రూవ్ చేసుకున్నాడు. అది నిలబెట్టుకోవాలంటే ఛైనా నుంచి తిరిగొచ్చాక ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తే బెటర్. చిరు నెక్ట్స్ ఫిలిం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ స్వయంగా నిర్మించనున్నాడు. మరి బాసూ.. చూపించు నీ లుక్సులో గ్రేసు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/