Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : గడ్డంతో మళ్లీ ఆశ్చర్యపర్చిన చిరు
By: Tupaki Desk | 22 Oct 2018 11:06 AM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రంను రామ్ చరణ్ 200 కోట్ల బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జార్జియాలో జరుపుతున్నారు. అక్కడ నరసింహారెడ్డి సైన్యంకు బ్రిటీష్ సైన్యంకు మద్య ఉండే యుద్ద సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సమయంలోనే అక్కడ కొన్ని నుండి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొట్లో చిరంజీవి గుబురు గడ్డంతో ఆకట్టుకుంటున్నాడు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం చిరంజీవి సినిమా ప్రారంభంకు ముందే గడ్డంను ఎక్కువగా పెంచాడు. మొదటి షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత ఆ గడ్డంను తొలగించాడు. మళ్లీ ఇప్పుడు అంతకు మించిన గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. జార్జియాలో చాలా కష్టపడి యుద్ద సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వయసు మీద పడ్డా కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా కష్టతరమైన సీన్స్ ను కూడా చిరంజీవి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఖైదీ నెం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన సత్తా చాటాడు. ఇప్పుడ సైరా చిత్రంతో మెగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్న భారీ సినిమాను ఇస్తానంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి నమ్మకంతో ఉన్నాడట. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ - విజయ్ సేతుపతి - కిచ్చ సుదీప్ - నయనతార - తమన్నా ఇంకా ఎంతో మంది స్టార్స్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. బెల్జియం షెడ్యూల్ పూర్తి అయితే మెజార్టీ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లే అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.