Begin typing your search above and press return to search.

#CHIRU 152 ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారుడా?

By:  Tupaki Desk   |   23 Feb 2020 5:36 AM GMT
#CHIRU 152 ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారుడా?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఆచార్య (చిరు 152) ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ్యాట్నీఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి కొణిదెల అధినేత రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ కోకాపేట ప‌రిస‌రాల్లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది.

అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి ప్ర‌మోష‌న్ లేదు. చిరు లుక్ కి సంబంధించిన పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేయ‌లేదు. కానీ ఇంతలోనే ఎక్క‌డి నుంచి ప్ర‌త్య‌క్ష‌మైందో మెగాస్టార్ చిరంజీవి లుక్ ఇదీ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో వైర‌ల్ గా మారింది. దాంతో పాటే చిన్న వీడియో లీకు షాకిచ్చింది. ఈ ఫోటో చూడ‌గానే చిరంజీవి న‌క్స‌లైట్ పాత్ర ఇదేనా? లేదూ ప్ర‌జా నాట్య‌మండ‌లి క‌ళాకారుడా? అస‌లు ఆ మెడ‌లో ఎర్ర స్కార్ప్ దేనికోసం? అన్న సందేహం వ్య‌క్త‌మైంది.

అన్న‌ట్టు ఇది లీకువీరులు అందించిన లీకేనా? అన్న‌ది ఆరా తీస్తే .. ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌వేళ లీక్ చేసిన‌దే అయితే మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఉన్న‌ ఫేస్ బుక్ ఖాతాలో ఆ ఫోటోని ఎందుకు ఉంచిన‌ట్టు? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక ఈ ఫోటోకి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. చిరు ఈ లుక్ లో ఏజ్ లెస్ హీరోలా గ్యాంగ్ లీడ‌ర్ రేంజులో క‌నిపిస్తున్నారు. ఆ గ‌డ్డం... మీస‌క‌ట్టు.. హెయిర్ స్టైల్ సేమ్ టు సేమ్. 60 ప్ల‌స్ అయినా బాస్ లో గ్రేస్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. పైగా ఏజ్ ని స‌గం త‌గ్గించేశారా? అన్నంత‌గా షాకింగ్ లుక్ తో క‌నిపిస్తున్నారు. అందుకేనేమో ఒక అభిమాని చిరు అన్న‌య్య‌ 2.0 సీక్వెల్ లో న‌టిస్తున్నారా? అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను పోస్ట్ చేశారు. చిరు 2.0 కోసం వెయిటింగ్! అంటూ ఆస‌క్తిని వ్యక్తం చేసారు. ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నామ‌ని చిరుకి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు మ‌రికొంద‌రు మెగా ఫ్యాన్స్. చిరు అభిమాన సంఘాలు ఈ ఫోటోని వైర‌ల్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దేవాదాయ శాఖ భూకుంభ‌కోణానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ని అందులో ఓ పాత్ర న‌క్స‌లైట్ అంటూ ప్ర‌చారం సాగుతున్న క్ర‌మంలో తాజా లుక్ లీక్ ఉత్కంఠ‌ను పెంచుతోంది.