Begin typing your search above and press return to search.

మెగాస్టారుకు ఒళ్లు మండిపోయింది

By:  Tupaki Desk   |   8 Oct 2015 11:30 AM GMT


ఎలాంటి సందర్భంలోనూ సంయమనం కోల్పోడని మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. వేదికల మీద కానీ.. పబ్లిక్ లోకి వచ్చినపుడు కానీ చాలా కూల్ గా ఉంటాడు చిరు. తనను ఎవరైనా ఫ్రస్టేట్ చేసినా సంయమనం కోల్పోడు. ఐతే అలాంటి చిరుకి ఓ అభిమాని కోపం తెప్పించేశాడు. మెగా స్టారుకి ఒళ్లు మండిపోయి ‘స్టుపిడ్ ఫెలోస్’ అనేంతగా విసిగించాడు.

బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ కోసం హైటెక్స్ కు వచ్చినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. వేడుక ముగిసిన అనంతరం చిరంజీవి కారెక్కబోతుండగా అభిమానులు చుట్టుముట్టారు. ఓ అభిమాని పదే చిరంజీవి ముందుకొచ్చి దండం పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో చిరంజీవికి విసుగెత్తుకొచ్చింది. ప్రతిసారీ అలా దండం పెడుతుండేసరికి కోపం వచ్చింది.

‘‘ఎన్నిసార్లు అలా దండం పెడతావ్. మిమ్మల్ని చూసినపుడల్లా తిరిగి విష్ చేయాలా? స్టుపిడ్ ఫెలోస్’’ అంటూ కోపంగా అరిచేసి కారెక్కేశాడు చిరు. ఎవరో దృశ్యాన్ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాకు ఎక్కించేశారు. ఇప్పుడది వైరల్ అవుతోంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే చిరు ఇంత ఫ్రస్టేట్ అయిపోయాడేంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఐతే చిరంజీవే అలా సహనం కోల్పోయాడంటే జనాలు ఆయన్ని ఎంతగా విసిగించారో కూడా అర్థం చేసుకోవచ్చు.