Begin typing your search above and press return to search.
సైరా కోసం మారిపోయిన మెగాస్టార్
By: Tupaki Desk | 4 Dec 2017 5:42 AM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ 150వ సినిమా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అంతకంటే ఎక్కువ స్థాయిలో తన నెక్స్ట్ సినిమా కోసం చిరు చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించబోతోన్న సైరా సినిమా కోసం చిరు ఫిటెనెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రామ్ చరణ్ కూడా తండ్రితో పాటు జిమ్ లో పాల్గొంటున్నాడు.
డిసెంబర్ 6న రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాడు. అయితే మెగాస్టార్ ఫస్ట్ లుక్ కోసం చాలా కష్టపడుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటోని చూస్తే మనకే అర్ధమవుతోంది. ఆరు పదుల వయసు దాటినా కూడా మెగా స్టార్ ఒక యోధుడిగా కనిపిస్తున్నాడు అనే భావన కలుగుతోంది.
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా మెగాస్టార్ తన బాడీ షేప్ ను మార్చుకున్నారు. తప్పకుండా సినిమాలో ఆయన అందరికి నచ్చేలా కనిపిస్తారని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో సినిమా మొదటి షూట్ స్టార్ కానుంది. నిర్మాత రామ్ చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి అందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు.