Begin typing your search above and press return to search.
చిరు భుజానికి మరోసారి ఆపరేషన్
By: Tupaki Desk | 24 March 2016 9:15 AM GMTమెగాస్టార్.. కాంగ్రెస్ పార్టీ నేత.. రాజ్యసభ సభ్యులు అయిన చిరంజీవి భుజానికి ఆ మధ్య శస్త్ర చికిత్స చేయటం తెలిసిందే. అయితే.. ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని.. మరోసారి ఆపరేషన్ చేయనున్నారన్నది తాజా సమాచారం. మరికొద్ది రోజుల్లో ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరగనుంది.
అయితే.. ఈ శస్త్ర చికిత్స.. చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేడుక తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. భుజానికి సంబంధించిన సమస్యతో చిరంజీవి గత రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. మొన్నామధ్య ఒకసారి చికిత్స చేసిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో మరోసారి చికిత్స చేస్తారని.. ఆ తర్వాతే ఆయన 150వ చిత్ర షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు.