Begin typing your search above and press return to search.

సరిగ్గా 9.30.. చిరు.. సబ్ కో సలాం

By:  Tupaki Desk   |   13 Feb 2017 4:29 PM GMT
సరిగ్గా 9.30.. చిరు.. సబ్ కో సలాం
X
సరిగ్గా టైము 9 గంటల 30 నిమిషాలు. అప్పటికే ఉదయం నుండి అందరూ 'మా టివి' ఛానల్ స్ర్కీన్ పై కౌంటింగ్ చూస్తూనే ఉన్నారు. ఇక టైమర్ 0 00 అవ్వగానే.. మా టివి వారు కొత్తగా తయారు చేసిన ఒక విజువల్ వచ్చేసింది.. ఇప్పటివరకు మా టివి లోని హిట్ షోలలో చేస్తున్న నటీనటులందరూ కలర్ ఫుల్ గా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సీన్లు.. కట్ చేస్తే.. పంచ కట్టిన మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ. ఇక నుండి 'మా టివి'.. 'స్టార్ మా' అంటూ చెబుతూ 'అదే బంధం.. సరికొత్త ఉత్తేజం' అంటూ.. బుల్లితెరపై గత దశాబ్దకాలంగా మనం చూస్తున్న మా టివి లోగోను మార్చేశారు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి.. తనదైన స్టయిల్లో ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' అనే ప్రోగ్రామ్ తో బుల్లితెర వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చారు. ఆదాబ్ సస్రేకాల్ అంటూ అమితాబ్ బచ్చన్ గతంలో కౌన్ బనేగా కరోడ్ పతిలో ఎంట్రీ ఇచ్చినట్లు.. చిరంజీవి ఇప్పుడు ''నమస్తే.. ప్రణాం.. సబ్ కో సలాం'' అంటూ ఎంట్రీ ఇచ్చేశారు. ఒక్కసారిగా ఆయన ఎంట్రీతో ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎక్సయిట్ అయిపోయారంతే. దాదాపు 20 నిమిషాలు పాటు.. ఈ కార్యక్రమాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా వ్యాఖ్యానించిన చిరంజీవి.. అప్పుడు ఒక చిన్న బ్రేక్ అన్నారు. 'చిరు విరామం.. చిటికెలో వచ్చేస్తే.. డోంట్ గో ఎవే'' అంటూ ఉత్తేజపరిచారు మెగాస్టార్.

ఆ విధంగా చిరంజీవి బుల్లి తెర ఎంట్రీ.. ప్లస్ మాటివి లోగో మార్చే కార్యక్రమం.. అలా జరిగాయి. ఇక మీదట ఈ ప్రోగ్రాం ఎంతటి జనరంజకంగా మారుతుందో చూడాలి మరి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/