Begin typing your search above and press return to search.
గందరగోళంలో చిరంజీవి..?
By: Tupaki Desk | 10 Feb 2022 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచీ సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారంలోనూ చిరు ముందడుగు వేశారు. గతేడాది ఏప్రిల్ లో టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో పలువురు ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు.. దీనిపై పునరాలోచించాలని మరికొందరు విజ్ఞప్తులు చేసారు.
ఈ నేపథ్యంలో ఇటీవల చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమై పలు అంశాలను చర్చించారు. ఈ క్రమంలో గురువారం తోటి నటులు, దర్శకనిర్మాతలతో కలిసి మరోసారి సీఎంను కలిసి వచ్చారు. అయితే ఏ విషయం మీదైనా ఫుల్ క్లారిటీతో మాట్లాడే చిరంజీవి.. ఈ విషయంలో మాత్రం కాస్త గందరగోళ పరిస్థితులుల్లో ఉన్నారనే విధంగా ప్రవర్తించారు.
జనవరి 13న సీఎం జగన్ తో లంచ్ భేటీలో పాల్గొన్న చిరంజీవి.. సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై ఇండస్ట్రీలోని ఫిలిం ఛాంబర్ - కౌన్సిల్ - 'మా' అసోసియేషన్ లతో చర్చిస్తానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడతానని అన్నారు. అయితే టాలీవుడ్ సమస్యలపై చిరు ఒంటరిగా వెళ్లి చర్చించి రావడంపై చిత్ర పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అది ఆయన వ్యక్తిగత భేటీ అని కామెంట్స్ వచ్చాయి.
అయితే ఈసారి సీఎంతో సమావేశానికి చిరంజీవి తనతో పాటుగా మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - నిరంజన్ రెడ్డి - అలీ - ఆర్ నారాయణమూర్తి - పోసాని తదితరులను తీసుకుపోయారు. భేటీ అనంతరం పీపుల్స్ స్టార్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఈ మీటింగ్ కూడా నిర్మాతల మండలి - ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగలేదనేది స్పష్టం అవుతోంది.
నిజానికి జగన్ తో సమావేశం అవడానికి ముందే ఇండస్ట్రీలోని ఇతర సినీ పెద్దలతో మాట్లాడాలని ప్లాన్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో అలాంటి మీటింగ్ ఏదీ నిర్వహించలేదు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సినీ పెద్దలు సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్లనే జరగలేదని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తనకు మాత్రమే సీఎంఓ నుంచి ఆహ్వానం అదిందని చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద చిరు మీడియాతో మాట్లాడుతూ.. ''సీఎంఓ నుంచి నాకు మాత్రమే ఆహ్వానం అందిందని తెలిసింది. నాతో పాటుగా ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. మీడియాలో వస్తున్న కథనాలు చూసే మిగతా విషయాలు తీసుకున్నాను. సీఎంను కలిసిన తర్వాత మాట్లాడతా. ఈరోజు అన్నిటికి శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నా'' అని వ్యాఖ్యానించారు.
కానీ చిరంజీవి మిగతా సినీ ప్రముఖులతో కలిసి ఒకే స్పెషల్ ఫ్లైట్ లో అమరావతికి పయనమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. గురువారం మహేష్ వెడ్డింగ్ యానివర్సరీ అని విమానంలోనే ఒక పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరూ కలిసి వెళ్లాలని ముందే నిర్ణయించుకున్న తర్వాత.. చిరు విమానం ఎక్కే ముందు మాత్రం ఎవరెవరు వస్తున్నారో తెలియదని చెప్పడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జగన్ తో భేటీ కోసం వెళ్లే సినీ ప్రముఖులు వీరేనంటూ గత రెండు రోజులుగా మీడియాలో పలువురు పేర్ల జాబితా బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా వినిపించిన అక్కినేని నాగార్జున - జూనియర్ ఎన్టీఆర్ ఈ సమావేశానికి వెళ్ళలేదు. నాగ్ తన ఫ్యామిలీలో కరోనా కేసులు ఉండటంతో వెళ్లలేదని టాక్ వచ్చింది. కానీ లాస్ట్ మినిట్ లో తారక్ ఎందుకు డ్రాప్ అయ్యారనేది తెలియలేదు.
జగన్ తో మీటింగ్ కు వెళదామని ఆహ్వానించిన వారిలో చివరి నిమిషం వరకు ఎవరు వస్తారో.. ఎవరు రారో తెలియక పోవడం వల్లనే చిరంజీవి అలాంటి కామెంట్స్ చేసి ఉంటారనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక సీఎంతో భేటీ అనంతరం ఎప్పటిలాగే ఏపీ ప్రభుత్వానికి.. జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ప్రకటన రాకముందే ధన్యవాదాల ప్రోగ్రామ్ పెట్టారు.
ఫిబ్రవరి నెలాఖరుకు కొత్త జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిరంజీవి. పోయిన నెలలో కూడా పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని అన్నారు. ఆ మాట చెప్పి దాదాపు నెల గడిచింది. అందుకేనేమో ఈసారి కూడా కచ్చితమైన తేదీ చెప్పకుండా.. సానుకూలమైన జీవో వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇలా చిరు ఓవైపు ఇండస్ట్రీకి మరోవైపు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరించడంలో.. సుహృద్భావ వాతావరణం తీసుకురావడంలో కాస్త ఇబ్బంది పడ్డారేమో అనే కామెంట్స్ వస్తున్నాయి.
ఏదైతేనేం చిరంజీవి నేతృత్వంలో గత పది నెలలుగా పెండింగ్ లో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకబోతోంది. ముఖ్యమంత్రి జగన్ - సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే.. మెగాస్టార్ అన్నింటా ముందుండి తనవంతు కృషి చేశారని అర్థం అవుతోంది. మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - ఆర్ నారాయణమూర్తి సైతం ఈ విషయంలో పెద్దగా వ్యవహరించిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. మరి చిరు ఆశించినట్లు ఈ నెల మూడో వారం లోపు ఏపీ సర్కార్ అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందో లేదో చూడాలి.