Begin typing your search above and press return to search.
#Mega154 ఫస్ట్ లుక్: మాస్ మూల విరాట్ అవతారంలో మెగాస్టార్..!
By: Tupaki Desk | 6 Nov 2021 8:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'ఆచార్య' చిత్రాన్ని కంప్లీట్ చేసిన చిరు.. 'గాడ్ ఫాదర్' 'భోళా శంకర్' వంటి చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా మెగా 154వ ప్రాజెక్ట్ ని షురూ చేశారు. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈరోజు శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
#Mega154 సినిమా స్టార్ట్ అయిన విషయాన్ని వెల్లడించిన మేకర్స్.. తాజాగా చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. చేతికి మెడలో పెద్ద గొలుసులు వేసుకొని స్టైల్ గా లైటర్ తో బీడీ ముట్టించుకుంటూ చిరు మాస్ గెటప్ లో అలరించారు. అరాచకం ఆరంభం అంటూ వదిలిన ఈ పోస్టర్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూనకాలు లోడింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి ఒక మత్స్యకారుడిగా మాస్ గెటప్ లో కనిపించనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. #Mega154 చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణులు వంటి ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
#Mega154 ఫస్ట్ లుక్ సందర్భంగా డైరెక్టర్ బాబీ ట్వీట్ చేస్తూ.. ''నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది!! నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో #MEGA154 కోసం వర్క్ చేస్తున్నాను. 'మాస్ మూల విరాట్' అవతార్ లో ఆయన్ని చూడటాన్ని మేం ఎక్కువగా ఇష్టపడతాం. అన్నయ్య అరాచకం ఆరంభం. మెగాస్టార్ - రాక్ స్టార్ కాంబినేషన్ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నాను'' అని ట్వీట్ చేశారు.
అంతకముందు ప్రాజెక్ట్ ఆరంభంపై బాబీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ''మెగాస్టార్.. ఆయన పేరు వింటే.. అంతు లేని ఉత్సాహం! ఆయన పోస్టర్ చూస్తే.. అర్థం కాని ఆరాటం! తెర మీద ఆయన కనబడితే... ఒళ్లు తెలియని పూనకం! పద్దెనిమిదేళ్ల క్రితం.. ఆయన్ని మొదటి సారి కలిసిన రోజు కన్నకల.. నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను'' అని ట్వీట్ లో పేర్కొన్నారు.