Begin typing your search above and press return to search.
చరణ్ ను మిస్ అవుతున్న చిరు..!
By: Tupaki Desk | 12 Jan 2023 5:46 AM GMTమెగాస్టార్ చిరంజీవి, మెగా వారసుడు రామ్ చరణ్ ఇద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎంతగా బిజీగా ఉన్నారు అంటే కనీసం తండ్రీకొడుకులు కలుసుకోలేనంత బిజీగా ఉన్నారు. ఇద్దరు ఉండేది హైదరాబాద్ లోనే కానీ కలిసి చాలా రోజులైంది. ఈ విషయాన్నే చిరంజీవి రీసెంట్ వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కాస్త బాధగా చెప్పారు. చరణ్ ను మిస్ అవుతున్నా అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.
చరణ్ జపాన్ వెళ్లాడు.. వెళ్లే ముందు కలవడం కుదరలేదు.. అటు నుంచే టాంజానియా వెళ్లాడు. రాగానే 2 రోజులు మాత్రమే హైదరాబాద్ లో ఉండి న్యూజిల్యాండ్ షూటింగ్ కి వెళ్లాడు. మళ్లీ వచ్చి మరో రెండు రోజులు ఆగి అమెరికా వెళ్లాడు. న్యూజిల్యాండ్ వెళ్లొచ్చిన తర్వాత చరణ్ ఇంటికి వస్తే తాను ఇంట్లో లేను.. అలా చరణ్ కలిసి చాలా రోజులైంది అంటూ తండ్రిగా తన బాధను వ్యక్తం చేశారు చిరు.
హైదరాబాద్ లో ఉన్నా సరే ఇద్దరం రెగ్యులర్ గా కలవడం కుదరట్లేదని. చరణ్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు తను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానో.. ఇప్పుడు అది మళ్లీ రిపీట్ అయ్యిందని అన్నారు చిరు. చరణ్ చిన్నప్పుడు షూటింగ్స్ బిజీ వల్ల అసలు కలవలేకపోయే వాడిని.. ఉదయాన్నే వెళ్లి రాత్రి వచ్చే వాడిని..
తన వైఫ్ పదే పదే కలవమని చెబుతున్నా నిద్రపోతున్న చరణ్ ను ఓ ముద్దు పెట్టి వెళ్లిపోయే వాడిని.. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది అని అన్నారు చిరు. నేను తను బిజీ అవడం వల్ల కలవడం కుదరట్లేదని అన్నారు మెగాస్టార్.
ఇక మీదట ఆ పరిస్థితి ఉండదని.. తన ఇంట్లోనే ఒక పోర్షన్ చరణ్ కోసం సిద్ధం చేశానని.. మరికొద్ది రోజుల్లో ఉపాసన తో కలిసి చరణ్ తన ఇంటికి వచ్చేస్తారని అన్నారు. ఇకమీదట చరణ్ తనతోనే ఉంటాడని.. షూటింగ్ లేని టైం లో అందరం కలిసి లంచ్ చేస్తామని ఫ్యామిలీ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు చిరంజీవి.
తండ్రికి తగ్గ తనయుడిగా రాం చరణ్ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ సినిమాల్లో చరణ్ నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.