Begin typing your search above and press return to search.

'ఆచార్య' ఎఫెక్ట్‌.. అంతా గందరగోళం

By:  Tupaki Desk   |   3 Jun 2022 11:32 AM GMT
ఆచార్య ఎఫెక్ట్‌.. అంతా గందరగోళం
X
మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా పై మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి పెంచుకుని ఎదురు చూశారు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

కాని ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ కలిసి నటించినా కూడా అభిమానులను మరియు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఎంటర్ టైన్ చేయడంలో ఆచార్య విఫలం అయ్యాడు.

ఆచార్య ప్లాప్‌ ఏమో కాని ఇప్పుడు చిరంజీవి తదుపరి సినిమాల పై చాలా ప్రభావం పడబోతుంది. ఇప్పటికే గాడ్‌ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. గాడ్ ఫాదర్ ను అంతా సవ్యంగా ఉంటే ఆగస్టు లో విడుదల చేయాలనుకున్నారు. కాని ఆచార్య ఎఫెక్ట్ తో విడుదల విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి అయ్యిందో లేదో క్లారిటీ లేదు.

గాడ్‌ ఫాదర్ విడుదల అయిన వెంటనే భోళా శంకర్ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఈ రెండు సినిమాల్లో గాడ్‌ ఫాదర్ సినిమా లూసీఫర్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. ఇక భోళా శంకర్ సినిమా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ రెండు సినిమాల్లో మళ్లీ కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నట్లుగా మెగా కాంపౌండ్ నుండి వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి సినిమా అంటే మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి అనుకుంటారు. వారి అభిరుచికి తగ్గట్లుగా సినిమా లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. అందుకే గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాలను ఒకటికి రెండు సార్లు.. ఇద్దరు ముగ్గురి జడ్జ్‌ మెంట్‌ లను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

సినిమాల విడుదల విషయం లో కాస్త గందరగోళం నెలకొన్న త్వరలోనే విడుదల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినా.. కొన్ని సన్నివేశాలను రీ షూట్‌ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక్క ఆచార్య సినిమాల వల్ల చిరంజీవి మూడు నాలుగు సినిమాలపై ప్రభావం పడింది.