Begin typing your search above and press return to search.

మెగాస్టార్ చేతిలో అల్ల‌రి కృష్ణ‌య్య‌ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   28 Oct 2019 2:12 PM GMT
మెగాస్టార్ చేతిలో అల్ల‌రి కృష్ణ‌య్య‌ ఎవ‌రు?
X
మెగాస్టార్ ఇంట దీపావ‌ళి సంబ‌రాలు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ద‌మ్ములు అంతా ఒకే వేదిక‌గా పండ‌గ‌ను చేసుకోవ‌డంతో ఆ పోటోలు ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. అందులో ఛ‌మక్కుమ‌నిపించే ఫోటోలపై ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇంత‌కుముందు ప‌వ‌న్ భార్య అన్నా లెజినోవాతోపాటుగా అకీరానందన్‌- మార్క్ శంకర్ పవనోవిచ్‌- ఆద్య అంతా క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఫోటో సంద‌డి చేసింది. ఈ ఫోటోలో వార‌సులంతా ఒక్క‌టిగా క‌లిసిపోయారు. ఇక వేరొక ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ప‌వ‌న్ - అన్నా లెజినోవా జంట వార‌సుడైన మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ తో మైమ‌రిచి ఆడుకుంటున్న ఫోటో క‌నిపించింది. చెర్రీ చెప్పిన‌ట్టే చిరు కిడ్స్ తో ఎంతో జోవియ‌ల్ గా ఈ సెల‌బ్రేష‌న్ ని ఎంజాయ్ చేశారని అర్థ‌మ‌వుతోంది.

మార్క్ శంక‌ర్ ఈ వేడుక‌కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ తెచ్చాడు. అల్ల‌రి కృష్ణ‌య్య‌లా అత‌డు చేస్తున్న గొడ‌వ చూస్తుంటే మెగా ఇంట్లో ప్ర‌త్యేక‌మైన‌ మార్క్ వేసాడ‌నే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం చిన్నారి మార్క్ శంక‌ర్ చిరంజీవి తో ఉన్న ఫోటోలు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మెగా అభిమానులంతా ఈ ఫోటోలు చూసి తెగ అబ్బ‌ర‌పడిపోతున్నారు.