Begin typing your search above and press return to search.
మెగా వ్యూహం ఫలించింది...
By: Tupaki Desk | 26 Aug 2015 2:21 AM GMTనేను ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా అంటాడు పవన్ గబ్బర్ సింగ్ లో. కానీ గత మూడ్రోలుగా... అందరినీ మించి, అన్నిటినీ దాటిన ట్రెండ్ మాత్రం చిరంజీవే. అప్పుడెప్పుడో పార్టీ పెట్టినపుడు. ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినపుడు.. ఆ తర్వాత పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేసినపుడు మాత్రమే... మెగాస్టార్ గురించిన వార్తల కోసం వెతుకారు జనాలు. కానీ మధ్యమధ్యలో అన్నయ్య గురించి పవర్ స్టార్ మాట్లాడినపుడు మాత్రమే... చిరు పేరు న్యూస్ లో నానేది. లేదా చెర్రీ, బన్నీల్లో ఎవరైనా మంచి కామెంట్స్ చేస్తే... అప్పుడు కాస్త వినిపించేదంతే. ఇండివిడ్యువల్ గా చిరు పేరు అంతగా వినిపించిన సందర్బాలు తక్కువ.
కానీ ఇఫ్పుడు ఒక్కసారిగా చిరు ఎప్పుడూ లేనంత లైమ్ లైట్ లోకి వచ్చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన బర్త్ డే వేడుకల కోసం... సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో జనాలు పిచ్చిపిచ్చిగా సెర్చ్ చేసేశారు. 60వ బర్త్ డే సందర్భంగా ఆయనకు ఆయనే హాట్ టాపిక్ అయ్యారు మెగాస్టార్. దేశాన్ని కుదిపేసిన స్టాక్ మార్కెట్ నష్టాల కంటే... 7 లక్షల కోట్ల ప్రజల సంపద ఆవిరైపోవడం కంటే... చిరంజీవి బర్త్ డే విశేషాలే... ఎక్కువగా ఆకట్టుకున్నాయి ఫేస్ బుక్ జనాలని. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు... ఫేస్ బుక్ ట్రెండ్స్ చెబ్తున్నాయంతే. రాననుకున్నారా... రాలేననుకున్నారా అనే డైలాగ్ మెగాస్టార్ నోట ఇప్పుడు వినిపిస్తే మాత్రం... మరోసారి కేక అంతే. అయినా... చరిష్మా అనేది చెరిపేస్తే పోదని.. చిరంజీవిని చూస్తే అర్ధమవుతోంది కదూ.