Begin typing your search above and press return to search.

కంగారు పుట్టిస్తున్న మెగాస్టార్ న్యూ హెయిర్ స్టైల్..!

By:  Tupaki Desk   |   20 March 2021 3:50 PM GMT
కంగారు పుట్టిస్తున్న మెగాస్టార్ న్యూ హెయిర్ స్టైల్..!
X
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా పై మెగా అభిమానులలో అంచనాలు అదే రేంజిలో నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చాలావరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ ఎండోమెంట్స్ అధికారి పాత్రలో చాలా స్ట్రాంగ్ గా కనిపించబోతున్నాడు. తాజాగా మెగాస్టార్ కొత్త లుక్కుతో అభిమానులకు షాకిచ్చాడు. ఎందుకంటే.. మెగాస్టార్ హెయిర్ స్టైల్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇదివరకే ఓసారి మీసాలు లేకుండా బ్లఫ్ మాస్టర్ దర్శకుడితో దర్శనమిచ్చాడు. అలా చిరుని మీసాలు లేకుండా చూసేసరికి ఫ్యాన్స్ లో కాస్త కంగారు మొదలైంది.

అయితే మెగాస్టార్ మీసాలు లేని లుక్ పై ఎన్నో భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి. కానీ అదంతా ఊరికే అని చెప్పాడు. తాజాగా చిరు ప్రాణంఖరీదు లుక్కు హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చాడు. ఆ సినిమాలో రింగులు తిరిగిన జుట్టుతో కనిపించాడు. ఇప్పుడు తాజాగా అలాంటి లుక్కులో మెగాస్టార్ ప్రేక్షకులకు నచ్చట్లేదని టాక్. ఉప్పెన సక్సెస్ మీట్ లో పాల్గొన్న చిరు ఈ విధంగా కెమెరా కంటపడ్డాడు. కొత్తగా కనిపిస్తున్నాడు కానీ అంతగా ఆయనకు ఇప్పుడు సూట్ అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే కొన్నేళ్లుగా మెగాస్టార్ ఓ నీట్ డీసెంట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడిలా కనిపించేసరికి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి అది విగ్గా లేక హెయిర్ సిస్టమ్ ఉపయోగించాడో తెలియదు కానీ సూట్ అవ్వలేదు. ఈ లుక్కు గనక ఏదైనా సినిమా కోసమైతే ఖచ్చితంగా జనాలు స్వాగటించడం కష్టమే. చూడాలి మరి అసలు ఈ హెయిర్ స్టైల్ వెనక మేటర్ ఏంటో!