Begin typing your search above and press return to search.
ఇటు సైరా టీజర్.. అటు ఉయ్యావాడ వారి పెళ్లి
By: Tupaki Desk | 21 Aug 2018 5:14 PM GMTస్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ మంగళవారమే విడుదలైన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముని మనవడి కూతురి పెళ్లి జరగడం విశేషం. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. తామే నరసింహారెడ్డి మీద సినిమా చేయాలనుకున్నామని.. చిరంజీవి లాంటి హీరో ఈ చిత్రం చేస్తుండటం చాలా ఆనందంగా ఉందని నరసింహారెడ్డి ముని మనవడు అన్నాడు.
‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర గతంలో మేమే సినిమా నిర్మించాలనుకొన్నాం. అప్పట్లో ఈ విషయమై సుమన్.. సాయికుమార్ లను కూడా సంప్రదించాం. కానీ అది కార్యరూపం దాల్చలేదు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా.. ఆయన తనయుడు రాంచరణ్ సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ జీవితం సినిమాగా తియ్యటం చాలా సంతోషం. మా ప్రాంతాన్ని ఉయ్యాలవాడ స్మారక కేంద్రంగా తీర్చిద్దేందుకు ఇప్పటికే విగ్రహం కూడా చేయించాం. త్వరలో ఆ విగ్రహ ప్రతిష్టాపన - మెమోరియల్ హాల్ నిర్మాణం ప్రారంభించనున్నాం. నరసింహారెడ్డిని జాతీయ వీరుడుగా గుర్తించాలని అన్ని రాష్ట్రాలలో తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమంను చేప్పట్టిన దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డికి ధన్యవాదాలు’’ అని ఉయ్యాలవాడ మునిమనవడు చెప్పారు.