Begin typing your search above and press return to search.
పునీత్ అంత్యక్రియలకు చిరు, ఎన్టీఆర్, బాలయ్య, సినీ ప్రముఖులు.. భారీగా ఫ్యాన్స్ రాక
By: Tupaki Desk | 30 Oct 2021 7:30 AM GMTకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం షాక్ నుంచి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఇంకా కోలుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమలోనూ అనేక మందితో పునీత్ కు సత్సంబంధాలున్నాయి. ఆయన ఆకస్మిక మరణంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునీత్ మరణ వార్త విన్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. రాజ్ కుమార్ కుటుంబంతో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. బెంగలూరు ఎప్పుడు వెళ్లినా కలిసేవాడినన్నారు.పునీత్ మరణం జీర్ణించుకోలేకపోతున్నానన్నారు.
ఇక బాలక్రిష్ణ సైతం పునీత్ మరణంపై షాక్ అయ్యారు. పునీత్ ఇంత చిన్న వయసులోనూ తమందరినీ వదిలి వెళ్లిపోవడం పైన ఆవేదన వ్యక్తం చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్త వింటూనే తన హార్ట్ బ్రోకెన్ అంటూ ట్వీట్ చేశారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్, రాజ్ కుమార్ మధ్య సంబంధాలుండేవని.. పునీత్-జూ.ఎన్టీఆర్ మధ్య అంత క్లోజ్ రిలేషన్ నడిచింది. చక్రవ్యూహ అనే తన సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పునీత్ పాటలు కూడా పాడించాడు.
పునీత్ మరణంతో షాక్ అయిన చిరంజీవి, బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బెంగళూరు వెళ్లారు. పునీత్ భౌతిక ఖాయానికి నివాళులర్పించారు. తమ కళ్ల ముందే ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ తో కన్నడ నాట హీరోగా ఎదిగిన పునీత్ కు చివరిసారిగా చూసేందుకు మన తెలుగు హీరోలు వెళ్లారు. ఇక కన్నడ హీరోలు, సినీ ప్రముఖులు సైతం పునీత్ మృతదేహానికి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు.
రాజ్ కుమార్ కుటుంబీకులు, సమీప బంధువులు తరలివచ్చారు. తన తమ్ముడు అప్పును ప్రశాంతంగా పంపుదామంటూ రాఘవేంద్ర రాజ్ కుమార్ తీవ్ర ఆవేదన చెందారు.