Begin typing your search above and press return to search.

లవ్‌ కు సపోర్ట్‌ కావాలనేవాడు..కోడి రామకృష్ణతో చిరు జ్ఞాపకాలు

By:  Tupaki Desk   |   22 Feb 2019 4:53 PM
లవ్‌ కు సపోర్ట్‌ కావాలనేవాడు..కోడి రామకృష్ణతో చిరు జ్ఞాపకాలు
X
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ నేడు మద్యాహ్నం సమయంలో మృతి చెందిన విషయం తెల్సిందే. కోడి రామకృష్ణ 100కు పైగా సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్‌ ది గ్రేట్‌ దర్శకుడిగా పేరు సంపాదించారు. ఈయన మొదటి సినిమాను చిరంజీవి గారితో తీశారు. 'ఇంట్లో రామయ్య వీదిలో కృష్ణయ్య' టైటిల్‌ తో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా చిరంజీవి కెరీర్‌ లో కూడా మంచి చిత్రంగా నిలిచింది.

ఆ తర్వాత కూడా చిరంజీవి, కోడి రామకృష్ణల కలయికలో చాలా సినిమాలు వచ్చాయి. కోడి రామకృష్ణ మృతికి సంతాపం తెలిపేందుకు చిరంజీవి సతీ సమేతంగా వెళ్లారు. ఈ సందర్బంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణ గారితో తనకు ఉన్న అనుంబంధంను గుర్తు చేసుకున్నారు. 100 సినిమాలు చేసి దాసరి గారి శిష్యుడిగా ఆయన పేరు నిలబెట్టారు. నేను హిందీలో సినిమా చేయాలనుకున్న సమయంలో ఆయన సినిమానే రీమేక్‌ చేయాలని భావించాను. ప్రతి సినిమా విషయంలో కూడా చాలా పక్కాగా వ్యవహరించడంతో పాటు, కష్టపడి పని చేసేవారు. అందుకే వందకు పైగా సినిమాలు చేశారు.

ఆయన పెళ్లికి ముందు నుండే నాకు తెలుసు. పద్మగారితో ప్రేమ వ్యవహారాన్ని నాతో షేర్‌ చేసుకునే వారు. నేను, ఆయన కలిసి ఒక సినిమా చేస్తున్న సమయంలో తన ప్రేమకు సాయం చేయాలని నన్ను అడిగారు. ప్రేమకు సలహాలు కూడా అడిగేవారని, పెళ్లి సమయంలో కూడా నాతో మాట్లాడారంటూ గత జ్ఞాపకాలను చిరంజీవి గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్‌ అయ్యారు. కోడి రామకృష్ణ మృతితో యావత్‌ తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది.