Begin typing your search above and press return to search.

చిరు లెక్క ఎక్కడ తప్పింది

By:  Tupaki Desk   |   12 Jan 2019 5:30 PM GMT
చిరు లెక్క ఎక్కడ తప్పింది
X
నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన వినయ విధేయ రామ పండగ సీజన్ వల్ల వసూళ్లయితే బాగానే రాబడుతోంది కానీ టాక్ మాత్రం దానికి తగ్గట్టు లేకపోవడం మెగా ఫాన్స్ ని నిరాశ పరుస్తోంది. అసలు ఇలాంటి అర్థం పర్థం లేని ఊర మాస్ సినిమా చేయడం ఏంటని వాళ్ళే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంత మాస్ హీరో అయినా మరీ ఇంత లాజిక్ లేకుండా సినిమా తీస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. అయితే తన సినిమాలతో పాటు చరణ్ కథలు కూడా వింటూ ఎప్పటికప్పుడు షూటింగ్ కు వస్తూ రషెస్ చెక్ చేసుకునే చిరంజీవి దీన్ని రంగస్థలం ముందే ఓకే చేశారట.

ఒకవేళ సుకుమార్ ది ప్రయోగం కాబట్టి తేడా కొడితే ఈ మాస్ మూవీతో కవర్ చేయొచ్చనే అంచనాతో. అయితే సీన్ రివర్స్ అయ్యింది. రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. వినయ విధేయ రన్ చూస్తుంటే అంతా ముగిసేలోపు డిజాస్టర్ స్టాంప్ తప్పేలా లేదు. అయితే కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే మెగా కాంపౌండ్ కు ఇది ఊహించని షాకే. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం బోయపాటి శీను కథను వినిపించినప్పుడు లైన్ మాత్రమే చెప్పాడట. తెరమీద చూసిన అతిశయోక్తులన్ని స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తున్నప్పుడు పొందుపరిచినవట. పైగా ఖైది తరహాలో రామ్ చరణ్ ని రాంబోలా చూపించాలనుకోవడం కూడా శీను ఐడియానేనట.

భారీతనం మీద పెట్టిన దృష్టి కథనం మీద పెట్టి ఉంటే ఎవడు రచ్చ నాయక్ లాగా ఇది కూడా ఖచ్చితంగా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యేదన్న మాటలో నిజం లేకపోలేదు. కాని కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కకపోవడానికి కారణం ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. నలుగురు అనాధలకు తమ్ముడిగా తన కుటుంబాన్ని కాపాడుకునే తమ్ముడిగా హీరో చేసే పోరాటం అనే పాయింట్ వినడానికి బాగుంది కానీ దాన్ని విస్తరించిన తీరు సరిగా లేకపోవడంతో ఇదుగో మాటలు పడాల్సిన భారీ సినిమాగా మిగిలిపోయింది.