Begin typing your search above and press return to search.
చిరు చూసి అన్నాడా చూడకుండా అన్నాడా!
By: Tupaki Desk | 13 Jan 2019 7:43 AM GMT1992లో వచ్చిన చిరు బ్లాక్ బస్టర్ మూవీ ఘరానా మొగుడులో ఓ డైలాగ్ చాలా పాపులర్. చూసి చింపిందా చూడకుండా చింపిందా అని రావుగోపాల రావు అంటే దానికి బదులుగా చిరంజీవి ఎలా చింపితే ఏంటి మొత్తానికి చిరిగిందిగా అంటూ చెప్పడం బాగా పేలింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. వినయ విధేయ రామ రిజల్ట్ ఏంటో తేలిపోయింది. మెగా ఫాన్స్ సైతం దీన్ని ట్రాల్ చేయకుండా ఉండలేకపోతున్నారు. అంత దారుణమైన ఫలితాన్ని అందుకుంది మరి. చరణ్ ఇంత కష్టపడినప్పటికీ కథాకథనాలు ప్రేక్షకుల నుంచి విమర్శల వర్షాన్ని కురిపించుకున్నాయి. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నా అదంతా పండగ సెలవుల ప్రభావమే తప్ప మరొకటి కాదు.
అయితే విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ లో చిరంజీవి దీని గురించి ఓ రేంజ్ లో పొగుడుతూ రామ్ చరణ్ ని బోయపాటి శీనుని ఆకాశానికెత్తేసాడు. ఇవన్నీ ఈవెంట్ లో సహజంగా అందరు మాట్లాడేవే అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. కట్ చేస్తే వినయ విధేయ రామ బొమ్మ తిరగబడింది. అప్పుడు ఆ వేదికలో చిరు మాట్లాడిన మాటలు మళ్ళి చర్చలోకి వస్తున్నాయి. అసలు చిరు సినిమాను చూసే పొగిడాడా లేక ట్రైలర్ బిట్లు ఓ రెండు మూడు యాక్షన్ సన్నివేశాలు చూసి సినిమా మొత్తం ఇలాగే ఉంటుంది అని ఊహించుకుని స్టేజి మీద అలా చెప్పేసాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
రంగస్థలం వేడుకలో చిరు చాలా స్పష్టంగా దాని విశేషాలు చెప్పాడు. ఆది పినిశెట్టి పాత్ర చనిపోయినప్పుడు చరణ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అంటే చూసాడు కాబట్టే అంత కాన్ఫిడెంట్ గా చెప్పి ఉండవచ్చు. అయితే వినయ విధేయ రామ పూర్తిగా చూసి ఉంటే చిరు ఖచ్చితంగా కొన్ని మార్పులు చెప్పేవారని సైరాలో బిజీగా ఉండటం వల్ల ఫైనల్ కాపీ చూడకపోవడం వల్లే మరీ తీసికట్టుగా వివిఆర్ ని బయటికి వదిలారని మెగా కాంపౌండ్ మాట. ఏదైతేనేం అభిమానులకు మాత్రం గట్టి షాకే ఇచ్చారుగా