Begin typing your search above and press return to search.
చిరు ఈసారి ఆ సాంప్రదాయాన్ని వదిలేశారా?
By: Tupaki Desk | 30 Sep 2019 3:39 PM GMTటాలీవుడ్ లో కొందరు హీరోలు మీడియా వారితో సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. అందులో మెగా స్టార్ ఒకరు. సీనియర్ జర్నలిస్టులందరూ ఆయనకి పరిచయస్తులే. హీరోగా సత్తా చాటుతున్న సమయం నుండే రెగ్యులర్ గా మీడియా వారిని కలుస్తూ ఉండేవారు. ఇక కం బ్యాక్ ఫిలిం 'ఖైదీ 150' కి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. సీనియర్లతో పాటు యంగ్ జరలిస్టులను కూడా ఇంటికి పిలిచి మరీ కాసేపు ముచ్చటించి ఇంటర్వ్యూ ఇచ్చారు.
అయితే ఇక 'సైరా'కి కూడా ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తారని భావిస్తే ఈ సారి తెలుగు మీడియాను లైట్ తీసుకున్నారు చిరు. సినిమా ఆరంభం నుండి ఇప్పటి వరకూ మెగా స్టార్ తెలుగు మీడియాతో మాట్లాదిందే లేదు. ముందు నుండి చరణే తెలుగులో ప్రెస్ మీట్స్ పెడుతూ వస్తున్నాడు. హైదరాబాద్ లో జరిగిన టీజర్ - ట్రైలర్ లాంచ్ కి చిరు హాజరుకాలేదు. ఇక రిలీజ్ కి ముందు ఓ ఈవెంట్ ద్వారా తెలుగు మీడియాను కలుస్తారనుకుంటే ఇక తెలుగులో ఈవెంట్ ఉండదనే టాక్ వినిపిస్తుంది.
మరి బాలీవుడ్ - కోలీవుడ్ - మల్లువుడ్ - శాండల్ వుడ్ ఇలా అన్ని వుడ్ లల్లో మీడియాతో ముచ్చటించి సైరా విషయాలను పంచుకున్న మెగా స్టార్ ఇంత వరకూ టాలీవుడ్ లో ఒక్క ఈవెంట్ కి కూడా ఎటెండ్ అవ్వకపోవడం ఏంటో ..? రిలీజ్ తర్వాతైనా చిరు తెలుగులో జరిగే ఈవెంట్ కి ఎటెండ్ అయి మీడియాను కలుస్తారా చూడాలి.