Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కు నిద్ర లేదట!!

By:  Tupaki Desk   |   20 Jun 2018 11:39 AM IST
మెగాస్టార్ కు నిద్ర లేదట!!
X
ప్రస్తుతం మెగాస్టార్ చీరంజీవి సైరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారతదేశ మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలా వాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గత ఆరు నెలల నుంచి ఈ సినిమా చిత్రీకరణ దశ కొనసాగుతోంది. అయితే ఇంకా 30 శాతం షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మొదట్లోనే అనుకున్నారు.

కానీ మొదటి షెడ్యూల్ ఆలస్యం కావడం వల్ల ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను ముందే ఫినిష్ చేస్తున్నాడు. ఇకపోతే ఇటీవల సినిమాకు సంబందించిన అసలైన యాక్షన్ పార్ట్ ని ఒక భారీ సెట్ లో స్టార్ట్ చేశారు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ని తెప్పించి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఫైట్స్ ను డిజైన్ చేస్తున్నారు. ఇకపోతే సినిమా షూటింగ్ ఒక్కోసారి ఆలస్యం అవుతోందట. ఉదయం నాలుగు అయినా కూడా చిత్ర యూనిట్ ప్యాకప్ చెప్పడం లేదు.

మెగాస్టార్ కూడా షూటింగ్ కు ఎక్కడా బ్రేక్ చెప్పడం లేదట. సమయాన్ని లెక్క చేయకుండా చిత్ర యూనిట్ తో పాటు కష్టపడుతున్నారు. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కి రాత్రుళ్ళు నిద్ర ఉండడం లేదని తెలుస్తోంది. 62 ఏళ్ల వయసులో ఆయన కష్టపడుతున్న తీరుకు చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నట్లు సమాచారం. మరి సినిమాలో ఆయన ఎలా కనిపిస్తారో చూడాలి.