Begin typing your search above and press return to search.
మెగాస్టార్ కు అచ్చిరాని ప్రయోగాలు!
By: Tupaki Desk | 27 Sep 2019 5:30 PM GMTటాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు కానీ వారందరిలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకమైనది. చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రత్యేకమైనదే. అయితే ఆయన మెగాస్టార్ ఇమేజ్.. ఆయనపై ఫ్యాన్స్ కు ఉండే ఎక్స్ పెక్టేషన్స్ వల్లే చిరు కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఆయన ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించినా.. ప్రయోగాలు చేసినా ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి.
చిరంజీవి సినిమాలలో భిన్నంగా ట్రై చేసిన ప్రతిసారీ ఆయనకో ఫ్లాప్ ఎదురైంది. 'ఆపద్భాందవుడు' లాంటి సినిమాలు చిరుకు ఓ నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం వాటికి నిరాశ తప్పలేదు. 'బిగ్ బాస్' లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక 'స్నేహం కోసం' లో వయసుమళ్ళిన పాత్రలో నటిస్తే ఆ సినిమా ఫలితం అటూ ఇటూ అయింది. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే చిరు మాస్ హీరోగా తన రెగ్యులర్ స్టైల్ లో సినిమాలు చేసినప్పుడు మాత్రం హిట్లు సాధించారు. చిరు రీ ఎంట్రీ చిత్రం 'ఖైది నెం. 150' దానికి ఓ ఉదాహరణ. అలా కాకుండా చిరు కనుక తన మాస్ రూటు మార్చి ప్రయోగం చేస్తే మాత్రం ఆ సినిమా ఫలితం మాత్రం నిరాశ పరుస్తుంది.
ఇలా చిరు ట్రాక్ రికార్డును బట్టి చూస్తే ఆయన కొత్త సినిమా 'సైరా' ఒక ప్రయోగమే అని చెప్పాలి. 'బాహుబలి' రేంజ్ భారీ బడ్జెట్.. ఫ్రీడమ్ ఫైటర్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించడం.. చిరు తన గెటప్ ను పూర్తిగా మార్చుకోవడం ఇలా 'సైరా' లో చాలా అంశాలు ఆయన శైలికి భిన్నమైనవి. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ను రంగరించడం పులిమీద స్వారీ చేయడం లాంటిది. ఒక సాధారణ మాస్ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ అటూ ఇటూ అయితే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు కానీ ఇలాంటి సినిమాలో కనుక తేడా కొడితే సినిమా ఫలితంపై అవి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మరి చిరు ఈ ప్రయోగాల సెంటిమెంట్ ను దాటగలరా లేదా అనేది మనకు గాంధీ జయంతి రోజున తెలుస్తుంది.