Begin typing your search above and press return to search.
చిరంజీవి.. వి.ఎన్.ఆదిత్య.. చంద్రముఖి
By: Tupaki Desk | 19 July 2015 5:30 PM GMTదక్షిణాది సినిమా వైపు దేశం మొత్తం చూసేలా చేసిన సినిమాల్లో చంద్రముఖి ఒకటి. బాబా లాంటి డిజాస్టర్ తర్వాత రజినీకాంత్ నటించిన ఈ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగులో సంచలన విజయం సాధించి.. సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఐతే రజినీ చేయడానికంటే ముందు తెలుగులో ఈ సినిమా చేయడానికి రెండు మూడు ప్రయత్నాలు జరిగాయట. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ ప్రతిపాదన వెళ్లిందట. మనసంతా నువ్వే, నేనున్నాను చిత్రాల దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ సినిమా మలయాళ మాతృక ‘మణిచిత్ర తాళు’ డీవీడీ పట్టుకెళ్లి చిరంజీవికి ఇచ్చి రీమేక్ చేద్దామన్నారట. కానీ చిరంజీవి ఆసక్తి చూపించలేదట. ఐతే చంద్రముఖి రిలీజయయ్యాక ఆ సినిమా సాధించిన విజయం చూసి.. చిరంజీవి వి.ఎన్.ఆదిత్యకు ఫోన్ చేసి నీ జడ్జిమెంట్ భేష్ అని చెప్పి, ఆ సినిమా తాను చేయనందుకు విచారం వ్యక్తం చేశాడట.
తమిళంలో కూడా ‘చంద్రముఖి’ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో సెట్స్ పైకి వెళ్లింది. మలయాళంలో రిలీజైన 11 ఏళ్లకు ఈ సినిమా తమిళంలో తెరకెక్కడం విశేషం. దాని కంటే ముందు కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా ‘ఆప్తమిత్ర’ పేరుతో రీమేకై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను థియేటర్‌కు మారు వేషంలో వెళ్లి మరీ చూసొచ్చిన రజినీకి చాలా నచ్చేసి.. డైరెక్టర్ పి.వాసుకు కబురు పెట్టారట. 2004లో శివాజీ గణేశన్ జయంతి సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి బయటికి వచ్చాక మీడియా సడెన్‌గా ఆయన స్థాపించిన బేనర్లో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు రజినీ. అప్పటికి ప్రభుతో కూడా సినిమా గురించి మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత వాసుని, ప్రభుని ఇంటికి పిలిపించుకుని మణిచిత్ర తాళు రీమేక్ గురించి చెప్పారు. ఈ సినిమాకు చంద్రముఖి టైటిల్ సూచించింది కూడా రజినీనే. గంగ పాత్రకు ముందు సిమ్రాన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఐతే షూటింగ్ మొదలయ్యాక సిమ్రాన్ ప్రెగ్నెంటవడంతో అవకాశం జ్యోతికకు దక్కింది.